ప్రభన్యూస్

Pawan Kalyan Wife: పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ భార్య.. కొత్త పేరేంటో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా పేరు మార్చుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

News18
News18

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా (Anna Lezhneva) తెలుగు ప్రజలకు సుపరిచితమే. రష్యాలో జన్మించినప్పటికీ, కొణిదెల వారి కోడలిగా, పవన్ భార్యగా ఆమె తెలుగువారిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే, విదేశీ సంతతికి చెందిన వ్యక్తి కావడంతో ఇప్పటికీ అందరూ ఆమెను ‘అన్నా లెజినోవా’ అనే పిలుస్తుంటారు. అయితే పవన్ తో పెళ్లి తర్వాత భారతీయ సంప్రదాయాలను, తెలుగు సంస్కృతిని పూర్తిగా వంటపట్టించుకున్న ఆమె.. ఇకపై తనను ఆ పేరుతో పిలవొద్దని, తన పేరు ‘అన్నా కొణిదెల’గా (Anna Konidela) మార్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

త్వరలో తన పుట్టినరోజు రానున్న సందర్భంగా సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్) వేదికగా ఆమె ఒక సుదీర్ఘమైన, ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేశారు. “నా పుట్టినరోజు రాబోతున్న తరుణంలో ఒక ముఖ్యమైన విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచినప్పటి నుంచి ఈ విషయం చెప్పాలని ఎన్నోసార్లు టైప్ చేసి, మళ్లీ డిలీట్ చేశాను. చాలామందికి నేను అన్నా లెజినోవాగానే తెలుసు. పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నప్పుడు నా పేరు అదే కావడంతో అలాగే పరిచయం అయ్యాను. ఒక ఫన్నీ విషయం ఏమిటంటే.. మా మ్యారేజ్ సర్టిఫికెట్‌ మీద మాత్రమే నా పేరు చివరిసారిగా అన్నా లెజినోవాగా నమోదైంది. పెళ్లి తర్వాత నా భర్త ఇంటిపేరు నా పేరులో కలిసిపోయింది. అలా అన్నా లెజినోవా కాస్తా ‘అన్నా కొణిదెల’గా మారింది” అని ఆమె వివరించారు.

ఈ పోస్ట్ చదివే ప్రతి ఒక్కరికీ ఆమె ఒక చిన్న విజ్ఞప్తి చేశారు. “ఇకపై నన్ను ‘అన్నా కొణిదెల’ అని మాత్రమే పిలవండి. ఇదే నా అసలు పేరు, నేను కోరుకుంటున్న గుర్తింపు. నా ఈ చిన్న కోరికను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అన్నా కొణిదెల అనే పేరు నాకు ఎంతో ప్రత్యేకమైనది” అని పేర్కొన్నారు. ఈ భావోద్వేగ భరితమైన పోస్ట్‌తో పాటు భర్త పవన్ కల్యాణ్‌తో కలిసి దిగిన ఒక అరుదైన త్రోబ్యాక్ ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లయిన కొత్తలో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు (St. Petersburg) వెళ్లినప్పుడు దిగిన ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

2011లో వచ్చిన ‘తీన్ మార్’ సినిమా షూటింగ్ సమయంలో పవన్, అన్నాల మధ్య పరిచయం ఏర్పడి, 2013లో వారు వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి పోలెనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్నా కేవలం పేరు మార్చుకోవడమే కాకుండా, పూర్తిగా హిందూ సంప్రదాయాలను పాటిస్తుంటారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుత విజయం సాధించి, పవన్ డిప్యూటీ సీఎంగా అడుగుపెడుతున్నప్పుడు.. అన్నా కొణిదెల ఆయనకు సంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చి తిలకం దిద్దిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మెగా ఇంట జరిగే ప్రతి వేడుకలోనూ చీరకట్టులో మెరుస్తూ తనలోని ‘తెలుగుదనాన్ని’ చాటుకుంటున్న అన్నా కొణిదెల తాజా నిర్ణయం పట్ల మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 July 2026, 8:58 pm Digital Edition : Prabhanews
Pawan Kalyan Wife: పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ భార్య.. కొత్త పేరేంటో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 28, 2026 8:42 PM ISTఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా పేరు మార్చుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. News18ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా (Anna Lezhneva) తెలుగు ప్రజలకు సుపరిచితమే. రష్యాలో జన్మించినప్పటికీ, కొణిదెల వారి కోడలిగా, పవన్ భార్యగా ఆమె తెలుగువారిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే, విదేశీ సంతతికి చెందిన వ్యక్తి కావడంతో ఇప్పటికీ అందరూ ఆమెను 'అన్నా లెజినోవా' అనే పిలుస్తుంటారు. అయితే పవన్ తో పెళ్లి తర్వాత భారతీయ సంప్రదాయాలను, తెలుగు సంస్కృతిని పూర్తిగా వంటపట్టించుకున్న ఆమె.. ఇకపై తనను ఆ పేరుతో పిలవొద్దని, తన పేరు 'అన్నా కొణిదెల'గా (Anna Konidela) మార్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.త్వరలో తన పుట్టినరోజు రానున్న సందర్భంగా సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్) వేదికగా ఆమె ఒక సుదీర్ఘమైన, ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేశారు. "నా పుట్టినరోజు రాబోతున్న తరుణంలో ఒక ముఖ్యమైన విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచినప్పటి నుంచి ఈ విషయం చెప్పాలని ఎన్నోసార్లు టైప్ చేసి, మళ్లీ డిలీట్ చేశాను. చాలామందికి నేను అన్నా లెజినోవాగానే తెలుసు. పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నప్పుడు నా పేరు అదే కావడంతో అలాగే పరిచయం అయ్యాను. ఒక ఫన్నీ విషయం ఏమిటంటే.. మా మ్యారేజ్ సర్టిఫికెట్‌ మీద మాత్రమే నా పేరు చివరిసారిగా అన్నా లెజినోవాగా నమోదైంది. పెళ్లి తర్వాత నా భర్త ఇంటిపేరు నా పేరులో కలిసిపోయింది. అలా అన్నా లెజినోవా కాస్తా 'అన్నా కొణిదెల'గా మారింది" అని ఆమె వివరించారు.ఈ పోస్ట్ చదివే ప్రతి ఒక్కరికీ ఆమె ఒక చిన్న విజ్ఞప్తి చేశారు. "ఇకపై నన్ను 'అన్నా కొణిదెల' అని మాత్రమే పిలవండి. ఇదే నా అసలు పేరు, నేను కోరుకుంటున్న గుర్తింపు. నా ఈ చిన్న కోరికను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అన్నా కొణిదెల అనే పేరు నాకు ఎంతో ప్రత్యేకమైనది" అని పేర్కొన్నారు. ఈ భావోద్వేగ భరితమైన పోస్ట్‌తో పాటు భర్త పవన్ కల్యాణ్‌తో కలిసి దిగిన ఒక అరుదైన త్రోబ్యాక్ ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లయిన కొత్తలో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు (St. Petersburg) వెళ్లినప్పుడు దిగిన ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.2011లో వచ్చిన 'తీన్ మార్' సినిమా షూటింగ్ సమయంలో పవన్, అన్నాల మధ్య పరిచయం ఏర్పడి, 2013లో వారు వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి పోలెనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్నా కేవలం పేరు మార్చుకోవడమే కాకుండా, పూర్తిగా హిందూ సంప్రదాయాలను పాటిస్తుంటారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుత విజయం సాధించి, పవన్ డిప్యూటీ సీఎంగా అడుగుపెడుతున్నప్పుడు.. అన్నా కొణిదెల ఆయనకు సంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చి తిలకం దిద్దిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మెగా ఇంట జరిగే ప్రతి వేడుకలోనూ చీరకట్టులో మెరుస్తూ తనలోని 'తెలుగుదనాన్ని' చాటుకుంటున్న అన్నా కొణిదెల తాజా నిర్ణయం పట్ల మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link