తీయని రుచితో పాటు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందించే పండ్లలో బొప్పాయి ముందు వరుసలో ఉంటుంది. బొప్పాయి పండులో విటమిన్ ఏ, సి, ఈ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు కంటిచూపును మెరుగుపరుస్తాయి. చర్మ కాంతిని పెంచడానికి, బరువు తగ్గడానికి కూడా బొప్పాయి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇన్ని అద్భుతమైన లాభాలు ఉన్నప్పటికీ, ఈ పండు అందరికీ సురక్షితం కాదు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు, ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారు బొప్పాయిని పొరపాటున కూడా తినకూడదని “సీనియర్ డైటీషియన్ డాక్టర్ ఎస్.స్వాతి హెచ్చరిస్తున్నారు. మరి వారెవరో ఒకసారి చూద్దాం.

