ప్రభన్యూస్

Omar Abdullah Marriage: రెండో పెళ్లి చేసుకున్న జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. ఫొటోలు వైరల్! |


Last Updated:

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ నూతన జీవితంలోకి అడుగుపెట్టినట్లు ఆయన ప్రకటించారు.

News18
News18

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా వీరి బంధంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, పెళ్లికి సంబంధించిన ఫొటోలను స్వయంగా ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. “కొత్త ప్రయాణం మొదలైంది” అంటూ నిధి రజ్దాన్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టడంతో ఈ పెళ్లి అధికారికంగా ధ్రువీకరణ అయింది. ఈ సందర్భంగా శనివారం ఢిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్డులో ఉన్న జమ్మూ కశ్మీర్ హౌస్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

కేవలం 71 మంది ప్రముఖ అతిథులకు మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా, మెహబూబా ముఫ్తీ, డెరెక్ ఓబ్రెయిన్, కపిల్ సిబల్ వంటి అగ్రశ్రేణి నాయకులు ఈ వేడుకకు హాజరవుతున్నారు. వివాహ వార్త ఖరారవడంతో ఈ ప్రైవేట్ డిన్నర్ ఇప్పుడు వెడ్డింగ్ రిసెప్షన్‌గా మారింది.

అబ్దుల్లా రెండో పెళ్లి..

ఒమర్ అబ్దుల్లా గతంలో 1994 సెప్టెంబర్ 1న ఢిల్లీకి చెందిన పాయల్ నాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి జహీర్, జమీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా 2011 నుంచి వీరిద్దరూ విడివిడిగా నివసించడం మొదలుపెట్టారు. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, 2016లో ఫ్యామిలీ కోర్టు, ఆ తర్వాత 2023 డిసెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు వీరి విడాకులను ఖరారు చేస్తూ తీర్పునిచ్చాయి. ఆ సుదీర్ఘ దాంపత్య బంధం ముగిసిన తర్వాత, 56 ఏళ్ల వయసులో ఒమర్ అబ్దుల్లా ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకుని తన జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ను అధికారికంగా ప్రారంభించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 October 2026, 4:24 pm Digital Edition : Prabhanews
Omar Abdullah Marriage: రెండో పెళ్లి చేసుకున్న జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. ఫొటోలు వైరల్! |

Last Updated:Oct 31, 2026 4:20 PM ISTజమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ నూతన జీవితంలోకి అడుగుపెట్టినట్లు ఆయన ప్రకటించారు.News18జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా వీరి బంధంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, పెళ్లికి సంబంధించిన ఫొటోలను స్వయంగా ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. "కొత్త ప్రయాణం మొదలైంది" అంటూ నిధి రజ్దాన్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టడంతో ఈ పెళ్లి అధికారికంగా ధ్రువీకరణ అయింది. ఈ సందర్భంగా శనివారం ఢిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్డులో ఉన్న జమ్మూ కశ్మీర్ హౌస్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.కేవలం 71 మంది ప్రముఖ అతిథులకు మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా, మెహబూబా ముఫ్తీ, డెరెక్ ఓబ్రెయిన్, కపిల్ సిబల్ వంటి అగ్రశ్రేణి నాయకులు ఈ వేడుకకు హాజరవుతున్నారు. వివాహ వార్త ఖరారవడంతో ఈ ప్రైవేట్ డిన్నర్ ఇప్పుడు వెడ్డింగ్ రిసెప్షన్‌గా మారింది.అబ్దుల్లా రెండో పెళ్లి..ఒమర్ అబ్దుల్లా గతంలో 1994 సెప్టెంబర్ 1న ఢిల్లీకి చెందిన పాయల్ నాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి జహీర్, జమీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా 2011 నుంచి వీరిద్దరూ విడివిడిగా నివసించడం మొదలుపెట్టారు. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, 2016లో ఫ్యామిలీ కోర్టు, ఆ తర్వాత 2023 డిసెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు వీరి విడాకులను ఖరారు చేస్తూ తీర్పునిచ్చాయి. ఆ సుదీర్ఘ దాంపత్య బంధం ముగిసిన తర్వాత, 56 ఏళ్ల వయసులో ఒమర్ అబ్దుల్లా ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకుని తన జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ను అధికారికంగా ప్రారంభించారు.మరింత చదవండి

Source link