ప్రభన్యూస్

Main Vaapas Aaunga: మై వాపస్ ఆవుంగా.. ప్రేక్షకులకు ఇంతియాజ్ అలీ కృతజ్ఞతలు | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ హిందీ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రేక్షకులను కలిసి దర్శకుడు ఇంతియాజ్‌ అలీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News18
News18

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ హిందీ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది.

ఈ ఏడాది హిందీ చిత్రాల్లో అత్యంత భారీ విదేశీ విడుదలల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, 59 దేశాల్లో 804 స్క్రీన్‌లపై విడుదలైంది. హిందీ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడం విశేషం. సినిమాకు వస్తున్న అద్భుతమైన స్పందన నేపథ్యంలో దర్శకుడు ఇంతియాజ్ అలీ హైదరాబాద్‌కు వచ్చి ప్రేక్షకులను కలుసుకున్నారు. తమ సినిమాను ఇంతగా ఆదరించి విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

తన భావోద్వేగ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఇంతియాజ్ అలీ, ‘మెయిన్ వాపస్ ఆవుంగా’కు లభిస్తున్న ప్రేమకు ఆనందం వ్యక్తం చేశారు. మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ సినిమా, ప్రేక్షకుల నోటి మాట ప్రచారంతో ఇప్పుడు ఈ ఏడాది అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ సినిమా భావోద్వేగ కథ, అద్భుత నటన, హృదయానికి హత్తుకునే సన్నివేశాలతో ఆకట్టుకుంది.

హైదరాబాద్ పర్యటనలో ఇంతియాజ్ అలీ.. అభిమానులతో మాట్లాడి వారి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకుల సానుకూల స్పందన వల్లే థియేటర్లలో షోలు పెరిగాయని, భారత్‌తో పాటు విదేశాల్లో కూడా సినిమా విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఇంతియాజ్ అలీ శైలిలో ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దిల్‌జిత్ దోసాంజ్, నసీరుద్దీన్ షా, శర్వరి, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించారు. బిర్లా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్తో కలిసి మోహిత్ చౌదరి, శిబాసిష్ సర్కార్ నిర్మించిన ఈ చిత్రాన్ని బిర్లా స్టూడియోస్ వరల్డ్‌వైడ్ విడుదల చేసింది. ఈ సినిమా సంగీతాన్ని టిప్స్ మ్యూజిక్ అందించింది. ప్రస్తుతం ఈ చిత్రం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 12:36 am Digital Edition : Prabhanews
Main Vaapas Aaunga: మై వాపస్ ఆవుంగా.. ప్రేక్షకులకు ఇంతియాజ్ అలీ కృతజ్ఞతలు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 23, 2026 11:38 AM IST'మెయిన్ వాపస్ ఆవుంగా' హిందీ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రేక్షకులను కలిసి దర్శకుడు ఇంతియాజ్‌ అలీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News18'మెయిన్ వాపస్ ఆవుంగా' హిందీ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది.ఈ ఏడాది హిందీ చిత్రాల్లో అత్యంత భారీ విదేశీ విడుదలల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, 59 దేశాల్లో 804 స్క్రీన్‌లపై విడుదలైంది. హిందీ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడం విశేషం. సినిమాకు వస్తున్న అద్భుతమైన స్పందన నేపథ్యంలో దర్శకుడు ఇంతియాజ్ అలీ హైదరాబాద్‌కు వచ్చి ప్రేక్షకులను కలుసుకున్నారు. తమ సినిమాను ఇంతగా ఆదరించి విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.తన భావోద్వేగ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఇంతియాజ్ అలీ, 'మెయిన్ వాపస్ ఆవుంగా'కు లభిస్తున్న ప్రేమకు ఆనందం వ్యక్తం చేశారు. మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ సినిమా, ప్రేక్షకుల నోటి మాట ప్రచారంతో ఇప్పుడు ఈ ఏడాది అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ సినిమా భావోద్వేగ కథ, అద్భుత నటన, హృదయానికి హత్తుకునే సన్నివేశాలతో ఆకట్టుకుంది.హైదరాబాద్ పర్యటనలో ఇంతియాజ్ అలీ.. అభిమానులతో మాట్లాడి వారి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకుల సానుకూల స్పందన వల్లే థియేటర్లలో షోలు పెరిగాయని, భారత్‌తో పాటు విదేశాల్లో కూడా సినిమా విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.ఇంతియాజ్ అలీ శైలిలో ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దిల్‌జిత్ దోసాంజ్, నసీరుద్దీన్ షా, శర్వరి, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించారు. బిర్లా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్తో కలిసి మోహిత్ చౌదరి, శిబాసిష్ సర్కార్ నిర్మించిన ఈ చిత్రాన్ని బిర్లా స్టూడియోస్ వరల్డ్‌వైడ్ విడుదల చేసింది. ఈ సినిమా సంగీతాన్ని టిప్స్ మ్యూజిక్ అందించింది. ప్రస్తుతం ఈ చిత్రం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link