హైదరాబాద్లో వంట గ్యాస్ వినియోగదారులకు మరిన్ని సౌకర్యవంతమైన ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) హైదరాబాద్లో ఇండేన్ ఎక్స్ట్రాలైట్ నౌ పేరుతో 10 కిలోల కాంపోజిట్ ఎల్పీజీ సిలిండర్ను, ఇండేన్ చోటు పేరుతో 5 కిలోల కాంపాక్ట్ ఫ్రీ-ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియన్ ఆయిల్ వివరాల ప్రకారం తేలికగా ఉండే, సులభంగా దొరికే, రోజువారీ వంట అవసరాలకు ఉపయోగపడే ఎల్పీజీ కోసం చూస్తున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వీటిని తీసుకొచ్చారు. బ్యాచిలర్స్, చిన్న కుటుంబాలకు ఈ చిన్న గ్యాస్ సిలిండర్లు అనుకూలంగా ఉంటాయి. ఎక్స్ప్రెస్ డెలివరీ, డిజిటల్ బుకింగ్ సౌకర్యాలతో ఈ కొత్త సిలిండర్లను అందిస్తున్నారు. దీంతో ఇండేన్ సేవల ప్రమాణాలను కొనసాగిస్తూనే వినియోగదారులకు మరింత సౌలభ్యం కలగనుంది. (image: IOCL)

