Last Updated:
యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్, నోనాకస్ కలిసి నిర్వహించిన తాజా NHS అధ్యయనంలో సుమారు 1,000 మంది రోగులపై ఈ పరీక్షను పరిశీలించారు. 964 మంది పాల్గొన్న ఈ అధ్యయనంలో GALEAS Bladder అనే మూత్ర పరీక్ష 77 మూత్రాశయ క్యాన్సర్ కేసుల్లో 71 కేసులను గుర్తించింది.
ఏ వ్యాధి గుర్తించాలన్న ఎంతకొంత పెయిన్ భరించాల్సిందే. కానీ మూత్రాశయ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు సాధారణ మూత్ర నమూనాతో చేసే ఒక కొత్త పరీక్ష సక్సెస్ అయింది. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్, నోనాకస్ కలిసి నిర్వహించిన తాజా NHS అధ్యయనంలో సుమారు 1,000 మంది రోగులపై ఈ పరీక్షను పరిశీలించారు. 964 మంది పాల్గొన్న ఈ అధ్యయనంలో GALEAS Bladder అనే మూత్ర పరీక్ష 77 మూత్రాశయ క్యాన్సర్ కేసుల్లో 71 కేసులను గుర్తించింది. అంటే సుమారు 92.2 శాతం కేసులను గుర్తించగలిగింది. అలాగే అధ్యయనంలో ఉన్న 17 మసిల్-ఇన్వేసివ్ బ్లాడర్ క్యాన్సర్ కేసులన్నింటినీ ఈ పరీక్ష గుర్తించింది.

