ముందే చెప్పినట్లుగా 31వ తేదీ వరకు గడువు ఉంది కదా అని చివరి నిమిషం వరకు వేచి చూడటం ఏమాత్రం మంచిది కాదు. ఆఖరి రోజుల్లో మళ్లీ సర్వర్లు డౌన్ కావడం, రద్దీ పెరగడం లాంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే వీలైనంత త్వరగా ఆన్లైన్లో లేదా ఏజెన్సీకి వెళ్లి కేవైసీ అప్డేట్ చేసుకోండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా వంట గ్యాస్ సేవలను నిరంతరాయంగా పొందుతూ ప్రశాంతంగా ఉండండి. మీ ఇంట్లోని వారు, తెలిసిన వారందరికీ ఈ విషయాన్ని తెలియజేసి వారు కూడా త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చూడాలని చిత్తూరు జిల్లా డిఎస్ఓ శంకర్ లోకల్ 18కు సమాచారం తెలిపారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో ఈ కేవైసీ చేసుకొని వారు త్వరితగతన పూర్తి చేసుకోవాలని కోరారు.
