Last Updated:
బల్లి కరిస్తే విషం ఎక్కుతుందని, ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందని కొందరు నమ్ముతారు. అయితే సాధారణంగా ఇళ్లలో కనిపించే బల్లులు విషపూరితమైనవి కావు.
ఇళ్ల గోడలపై కనిపించే బల్లులు, ముఖ్యంగా వర్షాకాలంలో, చాలా ఇళ్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. బల్లులు సాధారణంగా మనుషులకు దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తాయి. అయితే వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు లేదా వాటికి ప్రమాదం ఉందని అనిపించినప్పుడు కాటు వేయవచ్చు. బల్లి కాటు గురించి చాలామందిలో భయం ఉంటుంది. ముఖ్యంగా బల్లి కరిస్తే విషం ఎక్కుతుందని, ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందని కొందరు నమ్ముతారు. అయితే సాధారణంగా ఇళ్లలో కనిపించే బల్లులు విషపూరితమైనవి కావు. అందువల్ల వాటి కాటు వల్ల విషప్రయోగం జరిగి మరణించడం సాధారణ పరిస్థితి కాదు.

