ప్రభన్యూస్

LGBT A Legal Battle: ట్రాన్స్‌జెండర్‌ల కథతో ‘ఎల్‌జీబీటీ’ మూవీ సంచలనం.. హృదయానికి హత్తుకునేలా చూపిన సినిమా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సామాజిక సమస్యలను తన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన ‘ఎల్‌జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్’ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది.

News18
News18

సామాజిక సమస్యలను తన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన ‘ఎల్‌జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్’ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ట్రాన్స్‌జెండర్‌ల జీవితాలు, వారు ఎదుర్కొనే వివక్ష, న్యాయపోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ కోర్ట్‌రూమ్ డ్రామా సామాజిక వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో సినిమా బృందాన్ని అభినందిస్తూ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి, నటుడు ఎల్.బి. శ్రీరామ్‌తో పాటు యూనిట్ సభ్యులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాట్లాడిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావు, ఆత్మగౌరవం కోసం పోరాడే ట్రాన్స్‌జెండర్‌ల జీవితాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించిన సినిమా బృందాన్ని అభినందించారు. ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన సినిమాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.

ఎల్‌.బి. శ్రీరామ్‌ మాట్లాడుతూ… సినిమాలో అయితే జడ్జి స్థానంలో నిలుచున్నాను. కానీ వేదికపైన ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇంత గొప్ప దర్శకుడ్ని ఇంత ఆలస్యంగా గుర్తించడానికి అవమానంగా ఉంది నాకు. ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఈయనను ఎందుకు గుర్తించలేదు అని నాకు అనిపిస్తుంది. నాకు ఆయన సినిమాల్లో అనేక పాత్రలు ఇచ్చారు. చాలా మల్టీ ట్యాలెంటెడ్‌ ఆయన. జర్నలిజాన్ని సెకండరీగా పెట్టుకుని సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకోవడం అయిపోయింది. తెలుగులో ఇలాంటి సినిమా రావడం అనేది ఒక చరిత్ర అని చెప్పాలి. న్యాయదేవతకి కళ్ళకి గంతలు కడతారు. కానీ ఈ సినిమాలో నాకు కళ్ళకు గంతలు కట్టారు. జడ్జి అనేవాడు కళ్ళు ఎలాగూ ఉండి చూడలేడు కాబట్టి వచ్చింది విని చెప్పాలి. కాబట్టి వినాలి.. వినాలి.. వినాలి ఎంత వింటే అంత న్యాయం జరగాలి. ఈ సినిమా వల్ల ట్రాన్స్‌ జండర్స్‌ మీద సదప్రాయం ఏర్పడుతుంది. ఇంత ఉందా వీరి కథా వాళ్ళ ఆచారాలు అవి ఇన్ని ఉన్నాయా అని నాకు ఈ సినిమా ద్వారా తెలిసింది. స్క్రీన్‌ప్లే కాని అన్నీ బావుంటాయి. ఇలాంటి డైరెక్టర్లు చాలా ఎత్తుకు ఎదగాలి. ఇండస్ట్రీ గుర్తించాలి అని కోరుకుంటున్నాను. ఈ కమ్యూనిటీ అందరికీ చాలా థ్యాంక్స్‌ అన్నారు. మళ్లీ ఇలాంటి సినిమా వస్తుంది. సీక్వెల్‌ కూడా ఉంటుంది అది కూడా సునీల్‌గారే తీస్తారు అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఈ సినిమా ఒకే థియేటర్‌లో విజయవంతంగా ప్రదర్శించబడటం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ సినిమాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రావాలని ఆకాంక్షించారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ప్రతినిధులు ముకుంద, లైలా ఓరుగంటి, పోలీస్ ఇన్‌స్పెక్టర్ దాసు మాట్లాడుతూ.. సమాజంలో తాము ఎదుర్కొనే కష్టాలను ఈ సినిమా నిజాయితీగా చూపించిందన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తే విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

నటులు ఆనంద్ చక్రపాణి, విష్ణు తేజ, సనాఖాన్ కూడా సినిమా అనుభవాలను పంచుకుంటూ.. ఈ సినిమా సమాజంలో మార్పు తీసుకొచ్చే శక్తి కలిగి ఉందని పేర్కొన్నారు. చివరగా దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రేక్షకులు, విమర్శకులు అందించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ప్రదర్శనలకు ఆహ్వానాలు వస్తున్నాయని వెల్లడించారు. అలాగే 2027లో ‘ఎల్‌జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్’ సీక్వెల్‌ను తెరకెక్కించే ప్రణాళికలు ఉన్నాయని ప్రకటించారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 12:00 am Digital Edition : Prabhanews
LGBT A Legal Battle: ట్రాన్స్‌జెండర్‌ల కథతో ‘ఎల్‌జీబీటీ’ మూవీ సంచలనం.. హృదయానికి హత్తుకునేలా చూపిన సినిమా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 21, 2026 8:33 PM ISTసామాజిక సమస్యలను తన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన 'ఎల్‌జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్' ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. News18సామాజిక సమస్యలను తన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన 'ఎల్‌జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్' ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ట్రాన్స్‌జెండర్‌ల జీవితాలు, వారు ఎదుర్కొనే వివక్ష, న్యాయపోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ కోర్ట్‌రూమ్ డ్రామా సామాజిక వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో సినిమా బృందాన్ని అభినందిస్తూ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి, నటుడు ఎల్.బి. శ్రీరామ్‌తో పాటు యూనిట్ సభ్యులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాట్లాడిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావు, ఆత్మగౌరవం కోసం పోరాడే ట్రాన్స్‌జెండర్‌ల జీవితాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించిన సినిమా బృందాన్ని అభినందించారు. ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన సినిమాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.ఎల్‌.బి. శ్రీరామ్‌ మాట్లాడుతూ... సినిమాలో అయితే జడ్జి స్థానంలో నిలుచున్నాను. కానీ వేదికపైన ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇంత గొప్ప దర్శకుడ్ని ఇంత ఆలస్యంగా గుర్తించడానికి అవమానంగా ఉంది నాకు. ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఈయనను ఎందుకు గుర్తించలేదు అని నాకు అనిపిస్తుంది. నాకు ఆయన సినిమాల్లో అనేక పాత్రలు ఇచ్చారు. చాలా మల్టీ ట్యాలెంటెడ్‌ ఆయన. జర్నలిజాన్ని సెకండరీగా పెట్టుకుని సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకోవడం అయిపోయింది. తెలుగులో ఇలాంటి సినిమా రావడం అనేది ఒక చరిత్ర అని చెప్పాలి. న్యాయదేవతకి కళ్ళకి గంతలు కడతారు. కానీ ఈ సినిమాలో నాకు కళ్ళకు గంతలు కట్టారు. జడ్జి అనేవాడు కళ్ళు ఎలాగూ ఉండి చూడలేడు కాబట్టి వచ్చింది విని చెప్పాలి. కాబట్టి వినాలి.. వినాలి.. వినాలి ఎంత వింటే అంత న్యాయం జరగాలి. ఈ సినిమా వల్ల ట్రాన్స్‌ జండర్స్‌ మీద సదప్రాయం ఏర్పడుతుంది. ఇంత ఉందా వీరి కథా వాళ్ళ ఆచారాలు అవి ఇన్ని ఉన్నాయా అని నాకు ఈ సినిమా ద్వారా తెలిసింది. స్క్రీన్‌ప్లే కాని అన్నీ బావుంటాయి. ఇలాంటి డైరెక్టర్లు చాలా ఎత్తుకు ఎదగాలి. ఇండస్ట్రీ గుర్తించాలి అని కోరుకుంటున్నాను. ఈ కమ్యూనిటీ అందరికీ చాలా థ్యాంక్స్‌ అన్నారు. మళ్లీ ఇలాంటి సినిమా వస్తుంది. సీక్వెల్‌ కూడా ఉంటుంది అది కూడా సునీల్‌గారే తీస్తారు అన్నారు.సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఈ సినిమా ఒకే థియేటర్‌లో విజయవంతంగా ప్రదర్శించబడటం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ సినిమాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రావాలని ఆకాంక్షించారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ప్రతినిధులు ముకుంద, లైలా ఓరుగంటి, పోలీస్ ఇన్‌స్పెక్టర్ దాసు మాట్లాడుతూ.. సమాజంలో తాము ఎదుర్కొనే కష్టాలను ఈ సినిమా నిజాయితీగా చూపించిందన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తే విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.నటులు ఆనంద్ చక్రపాణి, విష్ణు తేజ, సనాఖాన్ కూడా సినిమా అనుభవాలను పంచుకుంటూ.. ఈ సినిమా సమాజంలో మార్పు తీసుకొచ్చే శక్తి కలిగి ఉందని పేర్కొన్నారు. చివరగా దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రేక్షకులు, విమర్శకులు అందించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ప్రదర్శనలకు ఆహ్వానాలు వస్తున్నాయని వెల్లడించారు. అలాగే 2027లో 'ఎల్‌జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్' సీక్వెల్‌ను తెరకెక్కించే ప్రణాళికలు ఉన్నాయని ప్రకటించారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link