వంటగది ఇంట్లో అత్యంత ముఖ్యమైన ప్రదేశం. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యానికి సంబంధించిన ఆహారం ఇక్కడే తయారవుతుంది. అందుకే వంటగది ఎప్పుడూ శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండటం చాలా అవసరం. చాలామంది ప్రతిరోజూ సింక్, గ్యాస్ స్టవ్, ప్లాట్‌ఫామ్, పాత్రలు, ర్యాక్‌లు శుభ్రం చేస్తుంటారు. కానీ గ్యాస్ స్టవ్ వెనుక ఉన్న గోడలు, చిమ్నీ చుట్టూ ఉండే భాగాలను మాత్రం తరచూ శుభ్రం చేయడం మరిచిపోతుంటారు. ఈ ప్రాంతాల్లో నూనె తుంపరలు, ఆవిరి, దుమ్ము కలిసి క్రమంగా జిడ్డుగా పేరుకుపోతాయి.

