Jr NTR: ఇదెక్కడి కాంబినేషన్‌రా బాబూ… అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ సినిమా… వా అన్న వా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కాంబినేషన్లు తెరపైకి వస్తుంటాయి. అయితే కొన్ని కాంబినేషన్లు మాత్రం ప్రేక్షకులు అస్సలు ఊహించరు. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సెట్ చేశాడు.

News18
News18

టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కాంబినేషన్లు తెరపైకి వస్తుంటాయి. అయితే కొన్ని కాంబినేషన్లు మాత్రం ప్రేక్షకులు అస్సలు ఊహించరు. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సెట్ చేశాడు. మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ ఎమోషన్స్‌తో అభిమానులను అలరించే ఎన్టీఆర్.. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను నవ్వించే దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తారక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.

ఎన్టీఆర్ తన సోషల్ మీడియా పోస్టులో అనిల్ రావిపూడిని ట్యాగ్ చేస్తూ #NTRxAnilRavipudi అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. అంతేకాదు.. ఈ కాంబినేషన్‌తో ప్రేక్షకులకు నవ్వుల జాతర అందించబోతున్నామనే సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ పోస్టులో తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థను కూడా ట్యాగ్ చేయడం మరో ఆసక్తికరమైన అంశం. దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఎన్టీఆర్ ఆర్ట్స్ చేపట్టనున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారనే అంచనాలు ఏర్పడ్డాయి.

నిజానికి ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది కామెడీ. ఎన్టీఆర్‌లో అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వచ్చిన ‘అదుర్స్’ సినిమాలో చారి పాత్రతో తారక్ పండించిన వినోదం ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్‌కు అప్పట్లో మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో తన కామెడీ యాంగిల్‌ను చూపించారు. అయితే పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్‌ను చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.

మరోవైపు అనిల్ రావిపూడి కామెడీ ఎంటర్‌టైనర్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ‘ఎఫ్2’, ‘ఎఫ్3’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలతో తనదైన వినోద శైలిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. స్టార్ హీరోలను కూడా తన మార్క్ కామెడీతో కొత్తగా చూపించగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ‘భగవంత్ కేసరి’ వంటి సినిమాలో యాక్షన్, ఎమోషన్స్‌ను కూడా సమర్థంగా తెరకెక్కించగలనని నిరూపించారు.

ఇప్పుడు ఈ రెండు భిన్నమైన శైలులు ఒకే సినిమాలో కలవబోతుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ తోడైతే థియేటర్లలో వినోదానికి కొదవ ఉండదని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా తారక్ నుంచి మరోసారి చారి తరహా కామెడీని ఆశిస్తున్నారు.

ఈ అనౌన్స్‌మెంట్ బయటకు వచ్చిన వెంటనే #NTRxAnilRavipudi సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇది ఊహించని కాంబినేషన్ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ కలయిక ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోననే ఆసక్తి నెలకొంది. ఇక సినిమా కథ, ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు, షూటింగ్ ప్రారంభ తేదీ వంటి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కలయిక టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 November 2026, 5:32 pm Digital Edition : Prabhanews
Jr NTR: ఇదెక్కడి కాంబినేషన్‌రా బాబూ… అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ సినిమా… వా అన్న వా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 14, 2026 5:18 PM ISTటాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కాంబినేషన్లు తెరపైకి వస్తుంటాయి. అయితే కొన్ని కాంబినేషన్లు మాత్రం ప్రేక్షకులు అస్సలు ఊహించరు. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సెట్ చేశాడు. News18టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కాంబినేషన్లు తెరపైకి వస్తుంటాయి. అయితే కొన్ని కాంబినేషన్లు మాత్రం ప్రేక్షకులు అస్సలు ఊహించరు. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సెట్ చేశాడు. మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ ఎమోషన్స్‌తో అభిమానులను అలరించే ఎన్టీఆర్.. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను నవ్వించే దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తారక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.ఎన్టీఆర్ తన సోషల్ మీడియా పోస్టులో అనిల్ రావిపూడిని ట్యాగ్ చేస్తూ #NTRxAnilRavipudi అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. అంతేకాదు.. ఈ కాంబినేషన్‌తో ప్రేక్షకులకు నవ్వుల జాతర అందించబోతున్నామనే సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ పోస్టులో తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థను కూడా ట్యాగ్ చేయడం మరో ఆసక్తికరమైన అంశం. దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఎన్టీఆర్ ఆర్ట్స్ చేపట్టనున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారనే అంచనాలు ఏర్పడ్డాయి.
This one's going to be a laugh riot… @AnilRavipudi
#NTRxAnilRavipudi@NANDAMURIKALYAN @NTRArtsOfficial https://t.co/jUMssuUrtU— Jr NTR (@tarak9999) November 14, 2026నిజానికి ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది కామెడీ. ఎన్టీఆర్‌లో అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వచ్చిన 'అదుర్స్' సినిమాలో చారి పాత్రతో తారక్ పండించిన వినోదం ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్‌కు అప్పట్లో మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో తన కామెడీ యాంగిల్‌ను చూపించారు. అయితే పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్‌ను చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.మరోవైపు అనిల్ రావిపూడి కామెడీ ఎంటర్‌టైనర్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 'ఎఫ్2', 'ఎఫ్3', 'సరిలేరు నీకెవ్వరు', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి చిత్రాలతో తనదైన వినోద శైలిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. స్టార్ హీరోలను కూడా తన మార్క్ కామెడీతో కొత్తగా చూపించగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. 'భగవంత్ కేసరి' వంటి సినిమాలో యాక్షన్, ఎమోషన్స్‌ను కూడా సమర్థంగా తెరకెక్కించగలనని నిరూపించారు.ఇప్పుడు ఈ రెండు భిన్నమైన శైలులు ఒకే సినిమాలో కలవబోతుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ తోడైతే థియేటర్లలో వినోదానికి కొదవ ఉండదని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా తారక్ నుంచి మరోసారి చారి తరహా కామెడీని ఆశిస్తున్నారు.ఈ అనౌన్స్‌మెంట్ బయటకు వచ్చిన వెంటనే #NTRxAnilRavipudi సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇది ఊహించని కాంబినేషన్ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ కలయిక ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోననే ఆసక్తి నెలకొంది. ఇక సినిమా కథ, ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు, షూటింగ్ ప్రారంభ తేదీ వంటి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కలయిక టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా మారింది.మరింత చదవండి

Source link