ప్రభన్యూస్

January 12 Vidudala: గెట్ రెడీ గర్ల్స్, ఇది మీ కోసమే..! జనవరి 12 విడుదల వదినా మరదలు సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే అనిల్‌ రావిపూడి.. ఈ సారి సంక్రాంతికి ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala) అంటూ మరో డిఫరెంట్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.

News18
News18

కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే అనిల్‌ రావిపూడి.. ఈ సారి సంక్రాంతికి ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala) అంటూ మరో డిఫరెంట్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనేది ట్యాగ్‌లైన్‌. వెంకటేశ్‌, కల్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చకచకా షూటింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తున్న మేకర్స్, ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు. ఇందులో భాగంగా తాజాగా మొదటి పాటను విడుదల చేశారు.

‘డివికి డివికి..’ అంటూ సాగిపోతున్న ఈ వదినా మరదలి పాటలో కీర్తి సురేశ్, కృతిశెట్టి తమ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్నారు (Diviki Diviki Song). ‘మా హామీ నువ్వే.. శివగామీ నువ్వే..’ అంటూ అనంత్‌ శ్రీరామ్‌ ఆకట్టుకునే లిరిక్స్‌ రాయగా.. మధుప్రియ, హరిప్రియ ఆలపించారు. హుషారెత్తించేలా ఉన్న ఈ పాట విడుదల చేసిన కాసేపట్లోనే వైరల్ అయింది. పండగ సీజన్ కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న ఈ చిత్రానికి ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా మంచి బజ్ నడుస్తోంది.

ట్రేడ్ వర్గాల్లో ప్రచారమవుతున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని కీలక ప్రాంతాల్లో భారీ మొత్తాలకు డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ బిజినెస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ భారీ మల్టీస్టారర్ నుంచి వరుసగా పాటలు, అప్‌డేట్స్ రానుండటంతో వెంకీ, కళ్యాణ్ రామ్ అభిమానుల్లో జోష్ నెలకొంది. అనిల్ రావిపూడి సినిమాల్లో సాధారణంగా కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదానికి ప్రాధాన్యం ఉంటుంది. ఈసారి కూడా అలాంటి అంశాలతో ప్రేక్షకులను అలరించేలా కథను సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి ఒకవైపు షూటింగ్‌తో బిజీగా ఉంటూనే, మరోవైపు ఇలాంటి వినూత్న ప్రమోషన్స్‌తో సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్నారు అనిల్ రావిపూడి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 3:07 pm Digital Edition : Prabhanews
January 12 Vidudala: గెట్ రెడీ గర్ల్స్, ఇది మీ కోసమే..! జనవరి 12 విడుదల వదినా మరదలు సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 21, 2026 3:04 PM ISTకామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే అనిల్‌ రావిపూడి.. ఈ సారి సంక్రాంతికి ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala) అంటూ మరో డిఫరెంట్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. News18కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే అనిల్‌ రావిపూడి.. ఈ సారి సంక్రాంతికి ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala) అంటూ మరో డిఫరెంట్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనేది ట్యాగ్‌లైన్‌. వెంకటేశ్‌, కల్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చకచకా షూటింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తున్న మేకర్స్, ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు. ఇందులో భాగంగా తాజాగా మొదటి పాటను విడుదల చేశారు.‘డివికి డివికి..’ అంటూ సాగిపోతున్న ఈ వదినా మరదలి పాటలో కీర్తి సురేశ్, కృతిశెట్టి తమ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్నారు (Diviki Diviki Song). ‘మా హామీ నువ్వే.. శివగామీ నువ్వే..’ అంటూ అనంత్‌ శ్రీరామ్‌ ఆకట్టుకునే లిరిక్స్‌ రాయగా.. మధుప్రియ, హరిప్రియ ఆలపించారు. హుషారెత్తించేలా ఉన్న ఈ పాట విడుదల చేసిన కాసేపట్లోనే వైరల్ అయింది. పండగ సీజన్ కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న ఈ చిత్రానికి ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా మంచి బజ్ నడుస్తోంది.ట్రేడ్ వర్గాల్లో ప్రచారమవుతున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని కీలక ప్రాంతాల్లో భారీ మొత్తాలకు డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ బిజినెస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ భారీ మల్టీస్టారర్ నుంచి వరుసగా పాటలు, అప్‌డేట్స్ రానుండటంతో వెంకీ, కళ్యాణ్ రామ్ అభిమానుల్లో జోష్ నెలకొంది. అనిల్ రావిపూడి సినిమాల్లో సాధారణంగా కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదానికి ప్రాధాన్యం ఉంటుంది. ఈసారి కూడా అలాంటి అంశాలతో ప్రేక్షకులను అలరించేలా కథను సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి ఒకవైపు షూటింగ్‌తో బిజీగా ఉంటూనే, మరోవైపు ఇలాంటి వినూత్న ప్రమోషన్స్‌తో సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్నారు అనిల్ రావిపూడి.మరింత చదవండి

Source link