Last Updated:
IRCTC Ticket Booking: పండుగ సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ రైలు ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటుండటంతో IRCTC ఆన్‌లైన్ బుకింగ్స్‌లో కొత్త రికార్డు నమోదైంది. సెప్టెంబర్ 7న ఒక్కరోజులోనే 20,06,353 రైలు టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ అయ్యాయి. మరుసటి రోజూ 19.50 లక్షలకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. పండుగల వేళ టికెట్లకు ఇంత డిమాండ్ ఎందుకు పెరిగింది? ప్రయాణికుల రద్దీని ఎదుర్కొనేందుకు IRCTC ఎలాంటి కొత్త మార్పులు చేసింది? తెలుసుకుందాం.
పండుగ సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ రైలు ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు, పండుగ సెలవుల్లో ప్రయాణాలు చేసేవారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో కొత్త రికార్డు నమోదు చేసింది. సెప్టెంబర్ 7న ఒక్కరోజులోనే 20 లక్షలకు పైగా రైలు టికెట్లు బుక్ అయ్యాయి. ఒక రోజులో బుకింగ్‌లు 20 లక్షల మార్కును దాటడం ఇదే తొలిసారి.

