వందే భారత్ స్లీపర్‌లో ఎన్ని బెర్తులున్నాయంటే?
ఈ రైలు మొత్తం 16 కోచ్‌లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో 11 ఏసీ త్రీ టైర్ కోచ్‌లు, 4 ఏసీ సెకండ్ టైర్ కోచ్‌లు, ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి. మొత్తం 823 బెర్తుల సామర్థ్యం ఉంది. ఇందులో ఏసీ 3 టైర్లో 611 బెర్తులు, ఏసీ 2 టైర్లో 188 బెర్తులు, ఫస్ట్ క్లాస్‌లో 24 బెర్తులు ఉన్నాయి. ఏసీ 3 టైర్లో మహిళల కోసం ఆరు బెర్తులు ప్రత్యేకంగా కేటాయించారు. రైల్వే సిబ్బంది డ్యూటీ పాస్ కోటా కింద మరో 21 బెర్తులను కేటాయించారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు వంటి అర్హులైన ప్రయాణికులకు నిబంధనల ప్రకారం సంబంధిత రిజర్వేషన్ కోటాలు వర్తిస్తాయి.

