హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (HCU)లో కాంట్రాక్ట్ కార్మికులు మరోసారి ఆందోళన బాట పట్టారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట నిరవధిక సమ్మె చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతిందని, దశాబ్దాలుగా సాధించుకున్న కార్మిక హక్కులు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయని ఆరోపించిన కార్మికులు, తమ హక్కులు పునరుద్ధరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Source link
HCU Contract Workers Protest : కాంట్రాక్ట్ కార్మికుల ఆగ్రహం!
