ప్రభన్యూస్

ప్రొబేషనరీ డీఎస్పీలకు ఆరు నెలల క్షేత్రస్థాయి శిక్షణ

పోలీసు విధుల్లో సమగ్ర అవగాహన, నైపుణ్యాల సాధనపై ఎస్పీ నరసింహ సూచనలు

సూర్యాపేట, నవంబర్ 23 (ప్రభ న్యూస్):

సూర్యాపేట జిల్లాకు కేటాయించబడిన ముగ్గురు ప్రొబేషనరీ డీఎస్పీలు ఆరు నెలల క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా జిల్లా పోలీస్ శాఖలో విధుల్లో చేరారు. భూసా ఉదయ్ కిరణ్, అల్మాస్ ఫాతిమా, ఖడావత్ రోజాబాయ్ జిల్లా ఎస్పీ నరసింహ, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రిపోర్ట్ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శిక్షణ కాలంలో పోలీసు విధివిధానాలు, నేరాల దర్యాప్తు, శాంతిభద్రతల నిర్వహణ, ఇంటెలిజెన్స్, సైబర్ భద్రత, ఫోరెన్సిక్, సాంకేతిక పరిజ్ఞానం, కోర్టులతో సమన్వయం, కమ్యూనిటీ పోలీసింగ్ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహనతో పాటు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
అనుభవజ్ఞులైన పోలీసు అధికారుల నుంచి విధుల నిర్వహణలో మెళకువలు నేర్చుకొని, భవిష్యత్తులో సమర్థవంతమైన పోలీసు అధికారులుగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ప్రొబేషనరీ డీఎస్పీల శిక్షణ విజయవంతంగా పూర్తయ్యేలా అవసరమైన సహకారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 November 2026, 7:34 pm Digital Edition : Prabhanews
<b>ప్రొబేషనరీ డీఎస్పీలకు ఆరు నెలల క్షేత్రస్థాయి శిక్షణ</b>