పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి విదేశీ బంగారాన్ని క్రమం తప్పకుండా అక్రమంగా తీసుకొస్తున్నారన్న పక్కా సమాచారం డీఆర్ఐకి అందింది. ఆ తర్వాత కొరియర్ పార్సిళ్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు బంగారాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో డీఆర్ఐ అధికారులు సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ముంబై, ఢిల్లీ, కోల్కతా, అహ్మదాబాద్, గువాహటిలో ఒకేసారి ఆపరేషన్ చేపట్టారు. (image: PIB)

