ప్రభన్యూస్

Gold Rate Today: గోల్డ్ డౌన్.. సిల్వర్ అప్.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే? | బిజినెస్


Last Updated:

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ రేట్లపై నెలకొన్న అంచనాల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లనే కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది బంగారం, వెండి లాంటి విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండనుంది. అయితే ఎంసీఎక్స్‌లో బుధవారం (జూలై 29) బంగారం పతనం కాగా.. వెండి పెరిగింది.

ఉదయం 9:05 నిమిషాలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం పతనం కాగా.. వెండి ఫ్యూచర్స్ పెరిగింది.

ప్రస్తుతం ఆగస్టు 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,41,331 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.292 తగ్గుదల. ఇక వెండి మాత్రం పెరిగింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,16,526 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.686 పెరిగింది.

ఫ్యూచర్స్ మార్కెట్ మాత్రమే కాకుండా స్పాట్ మార్కెట్‌లో కూడా బంగారం తగ్గి.. వెండి పెరిగింది. ఉదయం 9:10 గంటలకు bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే రూ.150 తగ్గి రూ.1,42,100కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గి ప్రస్తుతం రూ.1,30,258 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు మాత్రం బంగారంలా కాకుండా పెరిగాయి. గత మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కిలో వెండిపై రూ.680 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,17,160 వద్ద కొనసాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 July 2026, 9:37 am Digital Edition : Prabhanews
Gold Rate Today: గోల్డ్ డౌన్.. సిల్వర్ అప్.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే? | బిజినెస్

Last Updated:Jul 29, 2026 9:15 AM ISTGold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఫైల్ ఫోటోఅమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ రేట్లపై నెలకొన్న అంచనాల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లనే కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది బంగారం, వెండి లాంటి విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండనుంది. అయితే ఎంసీఎక్స్‌లో బుధవారం (జూలై 29) బంగారం పతనం కాగా.. వెండి పెరిగింది.ఉదయం 9:05 నిమిషాలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం పతనం కాగా.. వెండి ఫ్యూచర్స్ పెరిగింది.ప్రస్తుతం ఆగస్టు 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,41,331 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.292 తగ్గుదల. ఇక వెండి మాత్రం పెరిగింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,16,526 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.686 పెరిగింది.ఫ్యూచర్స్ మార్కెట్ మాత్రమే కాకుండా స్పాట్ మార్కెట్‌లో కూడా బంగారం తగ్గి.. వెండి పెరిగింది. ఉదయం 9:10 గంటలకు bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే రూ.150 తగ్గి రూ.1,42,100కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గి ప్రస్తుతం రూ.1,30,258 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు మాత్రం బంగారంలా కాకుండా పెరిగాయి. గత మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కిలో వెండిపై రూ.680 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,17,160 వద్ద కొనసాగుతోంది.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link