బంగారం ధర పెరగడంతో సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలు వస్తున్నాయి. 2019-20 సిరీస్ III గోల్డ్ బాండ్లను ముందుగానే రిడీమ్ చేసుకునే ఇన్వెస్టర్లు ఐదేళ్లలో పెట్టిన డబ్బుపై గరిష్ఠంగా 344 శాతం వరకు లాభం పొందొచ్చు. 2019-20 సిరీస్ III సావరిన్ గోల్డ్ బాండ్‌ను ప్రభుత్వం ఒక్క గ్రాముకు రూ.3,499 ధరతో జారీ చేసింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి డిజిటల్‌గా చెల్లించిన వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఇచ్చారు. దీంతో వారికి అసలు కొనుగోలు ధర గ్రాముకు రూ.3,449గా వచ్చింది. ఇప్పుడు ఈ బాండ్‌ను ముందుగానే రిడీమ్ చేసుకునే ధరను ప్రభుత్వం ఒక్క యూనిట్‌కు రూ.15,310గా నిర్ణయించింది. డిస్కౌంట్‌తో రూ.3,449కి బాండ్ కొన్న ఇన్వెస్టర్‌కు ఒక్క యూనిట్‌పై రూ.11,861 లాభం వస్తుంది. అంటే దాదాపు 344 శాతం లాభం అన్నమాట. సాధారణ ఇష్యూ ధర అయిన రూ.3,499కి కొనుగోలు చేసిన వారికి ఒక్క యూనిట్‌పై రూ.11,811 లాభం వస్తుంది. ఇది దాదాపు 338 శాతం. (ప్రతీకాత్మక చిత్రం)

