బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ ఆస్తిగా ఉన్న బంగారం, గోల్డ్ డిపాజిట్ల విలువ 2025 మార్చి 31 నాటికి రూ.4,31,624.80 కోట్లు. 2026 మార్చి 31 నాటికి ఇది రూ.7,06,162.36 కోట్లకు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలో ఈ బంగారం విలువ 63.6 శాతం పెరిగింది. బంగారం ధర పెరగడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గడం వల్ల ఈ పెరుగుదల వచ్చిందని ఆర్బీఐ తెలిపింది. ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న బంగారం విలువ కూడా ఇదే సమయంలో రూ.2,36,537.54 కోట్ల నుంచి రూ.3,88,147.13 కోట్లకు పెరిగింది. దీంతో ఆర్బీఐ మొత్తం బంగారం నిల్వల విలువ 2025 మార్చిలో రూ.6,68,162.34 కోట్ల నుంచి 2026 మార్చికి రూ.10,94,309.49 కోట్లకు చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
