Last Updated:
GITAM Colloqui 2026: ప్రజా విధానాలు, సామాజిక-ఆర్థిక అంశాలపై యువత ఆలోచనలు, పరిశోధనలకు వేదికగా నిలిచిన GITAM కొలోక్వి 2026 నాలుగో ఎడిషన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. “పాలసీ మార్గాలు: మూలాల నుండి మార్గాల వరకు” అనే థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా విద్యార్థులు, పరిశోధకులు, పాలసీ నిపుణులు, ఆసక్తిపరులు హాజరయ్యారు. సబ్సిడీలు, ఇంధన పరివర్తన, పునరుత్పాదక ఇంధనం వంటి అంశాలపై నిపుణుల ప్యానెల్ చర్చలతో పాటు పరిశోధనా పత్రాల సమర్పణలు, పాలసీ ప్లే, నీతి-ఇన్-క్వెస్ట్ పోటీలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
