దసరా సెలవుల్లో రిలీజ్ కాబోతున్న రణబాలి సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ మూవీపై అంతకంతకూ అంచనాల పెంచుకుంటూ పోయాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ను మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా వెనక జరిగిన ఆసక్తికర విశేషాలను నాలుగు ఎపిసోడ్ల డాక్యూమెంట్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ సోమవారం నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రోమో వైరల్ అవుతుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16న విడుదల కాబోతుంది.
Source link
Ranabali Movie: 'రణబాలి' నుంచి క్రేజీ అప్డేట్.. నాలుగు ఎపిసోడ్లతో రాబోతున్న డాక్యుమెంట్ సిరీస్!
