ప్రభన్యూస్

Gen Z Cases: ఢిల్లీ జెన్ జీ కేసులు రద్దు కావా? ఎత్తివేయడం కష్టమా? చట్టం ఏం చెబుతోంది? ఏంటి సమస్య? |


కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో CJP ప్రతినిధులు 3 రౌండ్ల చర్చలు జరిపి, జులై 25న తమ 36-37 రోజుల ఆందోళనను ఉపసంహరించుకున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ సంబంధిత ఆత్మహత్యల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై కేసులు ఎత్తివేయడం వంటి డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు CJP ప్రకటించింది. ప్రభుత్వం ఢిల్లీలోని 20-30 కేసులతో పాటూ, ఇతర రాష్ట్రాల్లోని కేసులను కూడా ఉపసంహరించుకుంటామనీ, భవిష్యత్తులో కొత్త కేసులు పెట్టబోమని హామీ ఇచ్చింది.

అయితే సోమవారం (జులై 27)తో గడువు ముగిసినా కేసులు ఇంకా రద్దు కాలేదు. ఢిల్లీ పోలీసులు “మాకు అధికారిక ఆదేశాలు ఇంకా రాలేదు” అని చెప్పారని న్యూస్18 హిందీ తెలిపింది. CJP ప్రతినిధి ఆశుతోష్ రంకా.. కేంద్ర ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. బీహార్, పశ్చిమ బెంగాల్‌లో వందల మంది విద్యార్థులను అరెస్టు చేశారనీ.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో నిఘా, వేధింపులు జరుగుతున్నాయని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అన్ని FIRలూ వెంటనే రద్దు చేయాలనీ, లేకపోతే మళ్లీ జాతీయ స్థాయి నిరసనలు చేస్తామని హెచ్చరించారు.

భారతీయ న్యాయ సంహిత (BNSS) సెక్షన్ 360 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ నేరపూరిత కేసునైనా ఉపసంహరించవచ్చు, కానీ అది అంత తేలిక కాదు.

1. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం లేదా ఢిల్లీ పోలీసులు.. ఈ రద్దు ప్రతిపాదనను సిఫార్సు చెయ్యాల్సి ఉంటుంది.

2. ఢిల్లీకి పెద్ద.. లెఫ్టినెంట్ గవర్నర్ (LG) కాబట్టి.. ఆయన అనుమతి తీసుకోవాలి.

3. ప్రభుత్వ ప్రాసిక్యూటర్.. కోర్టులో దరఖాస్తు చేసి, కేసులను రద్దు చెయ్యడం న్యాయం అనీ, రద్దు చేసినా పరిస్థితులు అల్లకల్లోలం అవ్వవు అని కోర్టును సంతృప్తి పరచాలి.

4. కోర్టు అనుమతి తర్వాతే కేసులు రద్దు అవుతాయి. ఛార్జ్‌షీట్ వెయ్యక ముందు కేసు రద్దు అయితే దాన్ని కేసు డిశ్చార్జ్ అంటారు. ఛార్జిషీట్ వేశాక రద్దు అయితే బహిష్కరణగా పరిగణిస్తారు.

సాధారణ ప్రదర్శన కేసుల్లో కేసుల్ని రద్దు చెయ్యడం తేలికే గానీ.. హింస, ప్రభుత్వ ఆస్తి నష్టం ఉన్న కేసుల్లో కోర్టు వివరంగా పరిశీలిస్తుంది. కొన్ని సందర్భాల్లో కోర్టులు ప్రభుత్వ దరఖాస్తును తిరస్కరించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. BNS సెక్షన్ 360లో కోర్టు.. బాధితుల వాంగ్మూలాలు కూడా తీసుకోవచ్చు అని చట్టం చెబుతోంది. అంటే.. విద్యార్థులు హింసకు పాల్పడితే, ఆ హింసలో బాధితులైన వారి స్టేట్‌మెంట్స్ కూడా పోలీసులు తీసుకోవచ్చు. ఇలాంటి చర్యలు.. కేసుల్ని ఎత్తివేయనివ్వకుండా అడ్డుకోగలవు.

ఇవి కూడా చదవండి: Astrology: సూర్య గురు గ్రహాల కలయిక.. వరిష్ఠ యోగం.. 12 రాశులపై అద్భుత ప్రభావం

CJP ఈ ఆలస్యాన్ని.. ఒప్పంద ఉల్లంఘనగా చూస్తోంది. వారు సీనియర్ లాయర్ కపిల్ సిబల్ సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యమం ఆగిపోయిన తర్వాత ప్రభుత్వం.. ఈ ఉద్యమానికి నేతృత్వం వహించిన వ్యక్తులను.. విడివిడిగా టార్గెట్ చేసే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నట్లు ANI రిపోర్ట్ తెలిపింది.

ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కేసులు రద్దు అయితేనే CJP పూర్తి విజయంగా పరిగణిస్తుంది. లేకపోతే మళ్లీ వీధుల్లోకి దిగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో కోర్టు పాత్ర కీలకం కావడంతో, కేవలం ప్రభుత్వ ఆదేశాలతోనే కేసులు ఆపివేయడం సాధ్యం కాదు. అందువల్ల నెక్ట్స్ ఏమవుతుంది అనేది యువతలో చర్చగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 July 2026, 8:30 am Digital Edition : Prabhanews
Gen Z Cases: ఢిల్లీ జెన్ జీ కేసులు రద్దు కావా? ఎత్తివేయడం కష్టమా? చట్టం ఏం చెబుతోంది? ఏంటి సమస్య? |

కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో CJP ప్రతినిధులు 3 రౌండ్ల చర్చలు జరిపి, జులై 25న తమ 36-37 రోజుల ఆందోళనను ఉపసంహరించుకున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ సంబంధిత ఆత్మహత్యల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై కేసులు ఎత్తివేయడం వంటి డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు CJP ప్రకటించింది. ప్రభుత్వం ఢిల్లీలోని 20-30 కేసులతో పాటూ, ఇతర రాష్ట్రాల్లోని కేసులను కూడా ఉపసంహరించుకుంటామనీ, భవిష్యత్తులో కొత్త కేసులు పెట్టబోమని హామీ ఇచ్చింది.అయితే సోమవారం (జులై 27)తో గడువు ముగిసినా కేసులు ఇంకా రద్దు కాలేదు. ఢిల్లీ పోలీసులు “మాకు అధికారిక ఆదేశాలు ఇంకా రాలేదు” అని చెప్పారని న్యూస్18 హిందీ తెలిపింది. CJP ప్రతినిధి ఆశుతోష్ రంకా.. కేంద్ర ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. బీహార్, పశ్చిమ బెంగాల్‌లో వందల మంది విద్యార్థులను అరెస్టు చేశారనీ.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో నిఘా, వేధింపులు జరుగుతున్నాయని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అన్ని FIRలూ వెంటనే రద్దు చేయాలనీ, లేకపోతే మళ్లీ జాతీయ స్థాయి నిరసనలు చేస్తామని హెచ్చరించారు.భారతీయ న్యాయ సంహిత (BNSS) సెక్షన్ 360 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ నేరపూరిత కేసునైనా ఉపసంహరించవచ్చు, కానీ అది అంత తేలిక కాదు.1. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం లేదా ఢిల్లీ పోలీసులు.. ఈ రద్దు ప్రతిపాదనను సిఫార్సు చెయ్యాల్సి ఉంటుంది.2. ఢిల్లీకి పెద్ద.. లెఫ్టినెంట్ గవర్నర్ (LG) కాబట్టి.. ఆయన అనుమతి తీసుకోవాలి.3. ప్రభుత్వ ప్రాసిక్యూటర్.. కోర్టులో దరఖాస్తు చేసి, కేసులను రద్దు చెయ్యడం న్యాయం అనీ, రద్దు చేసినా పరిస్థితులు అల్లకల్లోలం అవ్వవు అని కోర్టును సంతృప్తి పరచాలి.4. కోర్టు అనుమతి తర్వాతే కేసులు రద్దు అవుతాయి. ఛార్జ్‌షీట్ వెయ్యక ముందు కేసు రద్దు అయితే దాన్ని కేసు డిశ్చార్జ్ అంటారు. ఛార్జిషీట్ వేశాక రద్దు అయితే బహిష్కరణగా పరిగణిస్తారు.సాధారణ ప్రదర్శన కేసుల్లో కేసుల్ని రద్దు చెయ్యడం తేలికే గానీ.. హింస, ప్రభుత్వ ఆస్తి నష్టం ఉన్న కేసుల్లో కోర్టు వివరంగా పరిశీలిస్తుంది. కొన్ని సందర్భాల్లో కోర్టులు ప్రభుత్వ దరఖాస్తును తిరస్కరించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. BNS సెక్షన్ 360లో కోర్టు.. బాధితుల వాంగ్మూలాలు కూడా తీసుకోవచ్చు అని చట్టం చెబుతోంది. అంటే.. విద్యార్థులు హింసకు పాల్పడితే, ఆ హింసలో బాధితులైన వారి స్టేట్‌మెంట్స్ కూడా పోలీసులు తీసుకోవచ్చు. ఇలాంటి చర్యలు.. కేసుల్ని ఎత్తివేయనివ్వకుండా అడ్డుకోగలవు.ఇవి కూడా చదవండి: Astrology: సూర్య గురు గ్రహాల కలయిక.. వరిష్ఠ యోగం.. 12 రాశులపై అద్భుత ప్రభావంCJP ఈ ఆలస్యాన్ని.. ఒప్పంద ఉల్లంఘనగా చూస్తోంది. వారు సీనియర్ లాయర్ కపిల్ సిబల్ సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యమం ఆగిపోయిన తర్వాత ప్రభుత్వం.. ఈ ఉద్యమానికి నేతృత్వం వహించిన వ్యక్తులను.. విడివిడిగా టార్గెట్ చేసే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నట్లు ANI రిపోర్ట్ తెలిపింది.ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కేసులు రద్దు అయితేనే CJP పూర్తి విజయంగా పరిగణిస్తుంది. లేకపోతే మళ్లీ వీధుల్లోకి దిగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో కోర్టు పాత్ర కీలకం కావడంతో, కేవలం ప్రభుత్వ ఆదేశాలతోనే కేసులు ఆపివేయడం సాధ్యం కాదు. అందువల్ల నెక్ట్స్ ఏమవుతుంది అనేది యువతలో చర్చగా మారింది.

Source link