నగరాల వారీగా చూస్తే, దేశంలోని ఫైనాన్షియల్ క్రైమ్ కంప్లయన్స్ ఉద్యోగుల్లో దాదాపు 32 శాతం మంది బెంగళూరులో పనిచేస్తున్నారు. హైదరాబాద్ 16 శాతంతో రెండో స్థానంలో ఉంది. పుణె 13 శాతం, గురుగ్రామ్ 11 శాతం, ముంబై 10 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, రాబోయే రెండేళ్ల నుంచి మూడేళ్లలో కొత్తగా వచ్చే ఉద్యోగాల్లో దాదాపు 25 శాతం అహ్మదాబాద్, జైపూర్, కొచ్చి, కోయంబత్తూరు, ఇండోర్, భువనేశ్వర్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలకు మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే ఉద్యోగాల కోసం బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన నగరాలపైనే ఆధారపడాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)

