కనీస మొత్తం మాత్రమే చెల్లిస్తే అప్పుపై నియంత్రణలో ఉన్నామనే తప్పుడు భావన కలగవచ్చు. కానీ మిగిలిన బకాయిపై భారీ వడ్డీ పడుతూనే ఉండొచ్చు. అలాగే రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ వస్తాయని మాత్రమే చూసి డబ్బు ఖర్చు చేయకూడదు. ఈఎంఐ ఆఫర్‌ను అంగీకరించే ముందు, క్రెడిట్ కార్డుతో నగదు తీసుకునే ముందు లేదా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసే ముందు వడ్డీ, ఫీజులు, వర్తించే పన్నులతో కలిపి మొత్తం ఖర్చు ఎంతవుతుందో లెక్కించాలి” అని సీఏ అఖిల్ కంచర్ల వివరిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
