Free UPSC Coaching: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఫ్రీ UPSC కోచింగ్‌, నెలకు రూ.5,000 స్టైపెండ్.. ఎవరు అర్హులంటే? | తెలంగాణ వార్తలు


Last Updated:

Telangana Free UPSC Coaching 2027: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. హైదరాబాద్‌లో ఉచిత దీర్ఘకాలిక కోచింగ్‌తో పాటు నెలకు రూ.5,000 స్టైపెండ్, రూ.5,000 పుస్తక నిధి అందించే కార్యక్రమానికి త్వరలో దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 150 మందికి ఈ అవకాశాన్ని కల్పించనున్నారు.

News18
News18

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలంగాణ బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (TGBCESDTC) హైదరాబాద్‌లో నిర్వహించనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్)-2027 ఉచిత దీర్ఘకాలిక కోచింగ్ కార్యక్రమం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించనుంది. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమం 2026 ఆగస్టు 24 నుంచి 2027 మే వరకు హైదరాబాద్‌లోని సైదాబాద్, లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న టీజీ బీసీ స్టడీ సర్కిల్ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉత్తమ శిక్షణ అందించి, ఎక్కువ మంది అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

ఎంత మందికి అవకాశం కల్పిస్తారంటే?

ఈ కోచింగ్ కార్యక్రమంలో మొత్తం 150 మంది అభ్యర్థులకు ప్రవేశం కల్పించనున్నారు. వీరిలో 100 మందిని ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇక గతంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 50 మంది అభ్యర్థులకు ఎలాంటి స్క్రీనింగ్ పరీక్ష లేకుండానే నేరుగా ప్రవేశం కల్పిస్తారు.

స్టైపెండ్ ఎంతంటే?

ఈ కోచింగ్‌కు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం పలు ప్రత్యేక సౌకర్యాలను కల్పించనుంది. హాజరు నిబంధనలకు లోబడి ప్రతి నెల రూ.5,000 స్టైపెండ్ అందిస్తారు. అదనంగా ఒకేసారి రూ.5,000 పుస్తక నిధి కూడా ఇస్తారు. లైబ్రరీ సౌకర్యం, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా బోధన, సబ్జెక్ట్‌వారీ పరీక్షలు, సమాధాన పత్రాల మూల్యాంకనం, వ్యక్తిగత పనితీరు మెరుగుపర్చేందుకు ప్రత్యేక సూచనలు కూడా అందిస్తారు. దీంతో అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సమగ్రంగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది.

అర్హతలు ఏంటి?

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి. అభ్యర్థులు ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగంలో ఉండకూడదు. ఇతర విద్యా కోర్సులు చదువుతూ ఉండకూడదు. అలాగే ఇతర ప్రభుత్వ సంక్షేమ శాఖల ద్వారా ఇలాంటి ఉచిత కోచింగ్ పొందకూడదు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని అర్హతలను కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి.

ముఖ్యమైన తేదీలు ఇవే..

ఈ కోచింగ్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ జూలై 15, 2026న విడుదల కానుంది. జూలై 17 నుంచి ఆగస్టు 7 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 13 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 16న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించగా, ఆగస్టు 19న ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ఆగస్టు 21 నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టి, ఆగస్టు 24న కోచింగ్ తరగతులు ప్రారంభిస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్‌లోని సైదాబాద్, లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న టీజీ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అలాగే 040-24071178 లేదా 7780359322 నంబర్లకు ఫోన్ చేసి కూడా సమాచారం పొందవచ్చు. సివిల్ సర్వీసెస్‌లో కెరీర్ లక్ష్యంగా పెట్టుకున్న బీసీ అభ్యర్థులకు ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమం మంచి అవకాశంగా నిలవనుంది. శిక్షణతో పాటు స్టైపెండ్, పుస్తక నిధి, నిపుణుల మార్గదర్శకత్వం లభించనున్న నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 July 2026, 3:55 pm Digital Edition : Prabhanews
Free UPSC Coaching: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఫ్రీ UPSC కోచింగ్‌, నెలకు రూ.5,000 స్టైపెండ్.. ఎవరు అర్హులంటే? | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 14, 2026 3:39 PM ISTTelangana Free UPSC Coaching 2027: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. హైదరాబాద్‌లో ఉచిత దీర్ఘకాలిక కోచింగ్‌తో పాటు నెలకు రూ.5,000 స్టైపెండ్, రూ.5,000 పుస్తక నిధి అందించే కార్యక్రమానికి త్వరలో దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 150 మందికి ఈ అవకాశాన్ని కల్పించనున్నారు.
News18యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలంగాణ బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (TGBCESDTC) హైదరాబాద్‌లో నిర్వహించనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్)-2027 ఉచిత దీర్ఘకాలిక కోచింగ్ కార్యక్రమం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించనుంది. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ అధికారిక ప్రకటన విడుదల చేశారు.ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమం 2026 ఆగస్టు 24 నుంచి 2027 మే వరకు హైదరాబాద్‌లోని సైదాబాద్, లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న టీజీ బీసీ స్టడీ సర్కిల్ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉత్తమ శిక్షణ అందించి, ఎక్కువ మంది అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.ఎంత మందికి అవకాశం కల్పిస్తారంటే?ఈ కోచింగ్ కార్యక్రమంలో మొత్తం 150 మంది అభ్యర్థులకు ప్రవేశం కల్పించనున్నారు. వీరిలో 100 మందిని ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇక గతంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 50 మంది అభ్యర్థులకు ఎలాంటి స్క్రీనింగ్ పరీక్ష లేకుండానే నేరుగా ప్రవేశం కల్పిస్తారు.స్టైపెండ్ ఎంతంటే?ఈ కోచింగ్‌కు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం పలు ప్రత్యేక సౌకర్యాలను కల్పించనుంది. హాజరు నిబంధనలకు లోబడి ప్రతి నెల రూ.5,000 స్టైపెండ్ అందిస్తారు. అదనంగా ఒకేసారి రూ.5,000 పుస్తక నిధి కూడా ఇస్తారు. లైబ్రరీ సౌకర్యం, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా బోధన, సబ్జెక్ట్‌వారీ పరీక్షలు, సమాధాన పత్రాల మూల్యాంకనం, వ్యక్తిగత పనితీరు మెరుగుపర్చేందుకు ప్రత్యేక సూచనలు కూడా అందిస్తారు. దీంతో అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సమగ్రంగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది.అర్హతలు ఏంటి?దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి. అభ్యర్థులు ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగంలో ఉండకూడదు. ఇతర విద్యా కోర్సులు చదువుతూ ఉండకూడదు. అలాగే ఇతర ప్రభుత్వ సంక్షేమ శాఖల ద్వారా ఇలాంటి ఉచిత కోచింగ్ పొందకూడదు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని అర్హతలను కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి.ముఖ్యమైన తేదీలు ఇవే..ఈ కోచింగ్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ జూలై 15, 2026న విడుదల కానుంది. జూలై 17 నుంచి ఆగస్టు 7 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 13 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 16న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించగా, ఆగస్టు 19న ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ఆగస్టు 21 నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టి, ఆగస్టు 24న కోచింగ్ తరగతులు ప్రారంభిస్తారు.ఎలా దరఖాస్తు చేసుకోవాలి?అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్‌లోని సైదాబాద్, లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న టీజీ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అలాగే 040-24071178 లేదా 7780359322 నంబర్లకు ఫోన్ చేసి కూడా సమాచారం పొందవచ్చు. సివిల్ సర్వీసెస్‌లో కెరీర్ లక్ష్యంగా పెట్టుకున్న బీసీ అభ్యర్థులకు ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమం మంచి అవకాశంగా నిలవనుంది. శిక్షణతో పాటు స్టైపెండ్, పుస్తక నిధి, నిపుణుల మార్గదర్శకత్వం లభించనున్న నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link