పట్టణ ప్రాంతాల్లో కొన్ని నిర్దిష్ట వృత్తులు చేసే కార్మికులు ఈ పథకానికి అర్హులు. చెత్త ఏరుకునే వారు, బిచ్చం అడిగి జీవించే వారు, ఇళ్లలో పని చేసే కార్మికులు ఇందులో ఉన్నారు. రోడ్లపై బండ్లు పెట్టుకుని వ్యాపారం చేసే వారు, చెప్పులు కుట్టేవారు, వీధి వ్యాపారులు, వీధుల్లో ఇతర సేవలు అందించే వారు కూడా అర్హులు. నిర్మాణ కార్మికులు, ప్లంబర్లు, మేస్త్రీలు, కూలీలు, పెయింటర్లు, వెల్డర్లు, సెక్యూరిటీ గార్డులు, తలపై సరుకులు మోసే ఇతర కార్మికులు కూడా ఈ పథకానికి అర్హులు. స్వీపర్లు, పారిశుధ్య కార్మికులు, మాలీలు కూడా ఇందులోకి వస్తారు. ఇంటి దగ్గరే పని చేసే వారు, చేతివృత్తుల వారు, హస్తకళల కార్మికులు, టైలర్లు కూడా అర్హులే. రవాణా రంగంలో పనిచేసే వారు, డ్రైవర్లు, కండక్టర్లు, డ్రైవర్లు లేదా కండక్టర్లకు సహాయకులు, బండ్లు లాగే వారు, రిక్షా లాగే వారు కూడా ఈ పథకంలో కవరేజీ పొందవచ్చు. చిన్న దుకాణాల్లో పనిచేసే వారు, అసిస్టెంట్లు, ప్యూన్లు, సహాయకులు, డెలివరీ అసిస్టెంట్లు, అటెండెంట్లు, వెయిటర్లు కూడా అర్హులు. ఎలక్ట్రీషియన్లు, మెకానిక్లు, అసెంబ్లర్లు, రిపేర్ కార్మికులు, బట్టలు ఉతికేవారు, కాపలాదారులు కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)

