Last Updated:
FSSAI Action: ప్రముఖ ఫుడ్, డ్రింక్ బ్రాండ్లకు FSSAI షాక్ ఇచ్చింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు క్లెయిమ్లు, లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనలపై 150కి పైగా నోటీసులు జారీ చేసింది. మరి ఈ లిస్టులో ఏయే ప్రముఖ కంపెనీలు ఉన్నాయో తెలుసా?
ఆహార ఉత్పత్తుల నాణ్యత, భద్రత, లేబులింగ్ నిబంధనలను పర్యవేక్షించే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక చర్యలు చేపట్టింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు క్లెయిమ్లు, లేబులింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన ఆహార సంస్థలకు 150కి పైగా నోటీసులు జారీ చేసినట్లు FSSAI వెల్లడించింది. ఈ చర్యల్లో దేశంలోని ప్రముఖ ఆహార, పానీయాల బ్రాండ్లు కూడా ఉన్నాయి.

