అంతేకాకుండా, ఇండో-జర్మన్ కోఆపరేషన్ ఆన్ అగ్రివోల్టాయిక్స్ (IGCA) ఈ కార్యక్రమంలో ఒక కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం నడుస్తున్న, భవిష్యత్తులో చేపట్టబోయే అగ్రివోల్టాయిక్స్ ప్రాజెక్టుల కోసం రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs), పునరుత్పాదక ఇంధన డెవలపర్లు మరియు ప్రభుత్వ సంస్థల నుండి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఎంపిక చేసిన ప్రాజెక్టులకు సాంకేతిక సాయం, ఆర్థిక లోటును పూడ్చే ‘వైబిలిటీ గ్యాప్ ఫండింగ్’ (VGF), విస్తృత పరిశోధనా మద్దతును అందించనున్నట్లు పేర్కొంది.
