Last Updated:
Bank Holiday: దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం రేపు (శుక్రవారం) దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు.
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU), ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA) నేతృత్వంలో ఈ సమ్మె పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం జాతీయ చైర్మన్ అనిల్‌కుమార్ మాట్లాడారు. ప్రభుత్వ విధానాల వల్ల బ్యాంకింగ్ రంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ఉద్యోగుల న్యాయమైన హక్కులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ వేల కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ, వాటి వెనుక ఉన్న ఉద్యోగుల సంక్షేమాన్ని పాలకులు పూర్తిగా గాలికొదిలేశారని ధ్వజమెత్తారు.

