Last Updated:
Fact Check: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (Ministry of Education) పేరుతో విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) సంచలన నిజ నిర్ధారణ (Fact Check) వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమ్’ (Free Laptop Scheme) పేరిట ఎటువంటి పథకాన్ని ప్రారంభించలేదని, వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా నకిలీ (FAKE) అని తేల్చిచెప్పింది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫామ్‌లలో “గవర్నమెంట్ ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమ్ – అప్లై ఆన్‌లైన్” పేరుతో ఒక మెసేజ్ విపరీతంగా షేర్ అవుతోంది. ఈ పోస్ట్‌లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ లోగో, G20 లోగోలతో పాటు ప్రధానమంత్రి ఫోటోను ఉపయోగించారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నామని, వెంటనే ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలని మోసపూరిత లింక్ (Link)ను అందులో జత చేశారు.

