ప్రభన్యూస్

వెంకట్రామయ్య గారి తాలూకా మూవీ రివ్యూ.. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

పూర్తిస్థాయి కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ రోజు జూలై 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

News18
News18

యాక్షన్, హారర్, థ్రిల్లర్ చిత్రాల వెల్లువ కొనసాగుతున్న ఈ రోజుల్లో, పూర్తి స్థాయి కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ రోజు జూలై 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రముఖ జానపద గాయని కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా కోమలి క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ద్వారా దినేష్ కుమార్ హీరోగా, ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. కనుమరుగవుతున్న మానవ సంబంధాలకు అద్దం పట్టె కథతో సతీష్ ఆవాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తండ్రి వెంకట్రామయ్య (మురళీ గౌడ్ ). ఆయనకు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు. పిల్లలే ప్రాణంగా భావించే ఆయన, పిల్లల ప్రేమ పెళ్లిళ్లను కూడా ఒప్పుకొని, వారి కోసం ఉన్న భూములను కూడా అమ్మేసి త్యాగం చేస్తాడు. కాలంతో మారిపోయిన మానవ సంబంధాలు… వృద్ధాప్యంలో తల్లి, ఆ తర్వాత తండ్రి ఎదుర్కొనే వేదన.. ఈ భావోద్వేగాల సమాహారమే ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. నేటి సమాజంలో కనుమరుగవుతున్న అనుబంధాలను గుర్తు చేస్తూ తీసిన ఈ కథలో చివరకు తనను చిన్న చూపు చూసిన పిల్లలు పశ్చాత్తాపం చెందారా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ చిత్ర ప్రధాన కథాంశం నేటి సమాజంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్న మధ్యతరగతి తండ్రి వెంకట్రామయ్యగా మురళీధర్ గౌడ్ జీవించారు. పిల్లల సంతోషం కోసం తన ఆస్తులను సైతం త్యాగం చేసిన ఒక తండ్రి, ఆ తర్వాత కాలక్రమంలో మారిన పరిస్థితుల వల్ల పిల్లల నుండి ఎదుర్కొనే నిర్లక్ష్యం, ఒంటరితనం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. తల్లి పాత్రలో సీనియర్ నటి సుధ సహజ నటనతో అకట్టుకోగా, ఎలాంటి కృత్రిమ డ్రామాలు, బలవంతపు కామెడీ, అసభ్యకరమైన సంభాషణలు లేకుండా దర్శకుడు సతీష్ ఆవాల ఈ చిత్రాన్ని ఓ స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రంగా మలిచారు.

నూతన నటీనటులు దినేష్, దివిజ తమ తొలి చిత్రమైనప్పటికీ భావోద్వేగ సన్నివేశాల్లో ఎంతో పరిణితితో కూడిన అభినయాన్ని కనబరిచారు. కాశీ విశ్వనాథ్, సెల్వరాజ్, మిర్చి మాధవి, జబర్దస్త్ సత్యశ్రీ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా చరణ్ అర్జున్ అందించిన ఆరు పాటలతో పాటు, నేపథ్య సంగీతం సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలను తారాస్థాయికి చేర్చాయి. పల్లెటూరి వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా ఫ్రేమ్స్‌లో బంధించారు.

నిర్మాత కోమలి తన సొంత జీవితంలోని ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకోవడం, ఆ నిజ జీవిత అనుభవాల సారాంశాన్ని ఈ సినిమా ద్వారా వ్యక్తపరచడం కథకు మరింత సహజత్వాన్ని అద్దింది. వాణిజ్య హంగుల కోసం పాకులాడకుండా, సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తీసిన ఈ సినిమా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి చూడాల్సిన చిత్రం.

చివరగా.. డబ్బు కన్నా బంధాలు, అనుబంధాలే మిన్న అని చాటిచెప్పిన భావోద్వేగాల ప్రయాణమే ఈ ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.

రేటింగ్: 3

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 8:42 am Digital Edition : Prabhanews
వెంకట్రామయ్య గారి తాలూకా మూవీ రివ్యూ.. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 17, 2026 10:19 PM ISTపూర్తిస్థాయి కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'. ఈ రోజు జూలై 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. News18యాక్షన్, హారర్, థ్రిల్లర్ చిత్రాల వెల్లువ కొనసాగుతున్న ఈ రోజుల్లో, పూర్తి స్థాయి కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'. ఈ రోజు జూలై 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రముఖ జానపద గాయని కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా కోమలి క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ద్వారా దినేష్ కుమార్ హీరోగా, ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. కనుమరుగవుతున్న మానవ సంబంధాలకు అద్దం పట్టె కథతో సతీష్ ఆవాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.కథ:ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తండ్రి వెంకట్రామయ్య (మురళీ గౌడ్ ). ఆయనకు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు. పిల్లలే ప్రాణంగా భావించే ఆయన, పిల్లల ప్రేమ పెళ్లిళ్లను కూడా ఒప్పుకొని, వారి కోసం ఉన్న భూములను కూడా అమ్మేసి త్యాగం చేస్తాడు. కాలంతో మారిపోయిన మానవ సంబంధాలు... వృద్ధాప్యంలో తల్లి, ఆ తర్వాత తండ్రి ఎదుర్కొనే వేదన.. ఈ భావోద్వేగాల సమాహారమే 'వెంకట్రామయ్య గారి తాలూకా'. నేటి సమాజంలో కనుమరుగవుతున్న అనుబంధాలను గుర్తు చేస్తూ తీసిన ఈ కథలో చివరకు తనను చిన్న చూపు చూసిన పిల్లలు పశ్చాత్తాపం చెందారా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.విశ్లేషణ:ఈ చిత్ర ప్రధాన కథాంశం నేటి సమాజంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్న మధ్యతరగతి తండ్రి వెంకట్రామయ్యగా మురళీధర్ గౌడ్ జీవించారు. పిల్లల సంతోషం కోసం తన ఆస్తులను సైతం త్యాగం చేసిన ఒక తండ్రి, ఆ తర్వాత కాలక్రమంలో మారిన పరిస్థితుల వల్ల పిల్లల నుండి ఎదుర్కొనే నిర్లక్ష్యం, ఒంటరితనం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. తల్లి పాత్రలో సీనియర్ నటి సుధ సహజ నటనతో అకట్టుకోగా, ఎలాంటి కృత్రిమ డ్రామాలు, బలవంతపు కామెడీ, అసభ్యకరమైన సంభాషణలు లేకుండా దర్శకుడు సతీష్ ఆవాల ఈ చిత్రాన్ని ఓ స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రంగా మలిచారు.నూతన నటీనటులు దినేష్, దివిజ తమ తొలి చిత్రమైనప్పటికీ భావోద్వేగ సన్నివేశాల్లో ఎంతో పరిణితితో కూడిన అభినయాన్ని కనబరిచారు. కాశీ విశ్వనాథ్, సెల్వరాజ్, మిర్చి మాధవి, జబర్దస్త్ సత్యశ్రీ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా చరణ్ అర్జున్ అందించిన ఆరు పాటలతో పాటు, నేపథ్య సంగీతం సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలను తారాస్థాయికి చేర్చాయి. పల్లెటూరి వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా ఫ్రేమ్స్‌లో బంధించారు.నిర్మాత కోమలి తన సొంత జీవితంలోని ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకోవడం, ఆ నిజ జీవిత అనుభవాల సారాంశాన్ని ఈ సినిమా ద్వారా వ్యక్తపరచడం కథకు మరింత సహజత్వాన్ని అద్దింది. వాణిజ్య హంగుల కోసం పాకులాడకుండా, సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తీసిన ఈ సినిమా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి చూడాల్సిన చిత్రం.చివరగా.. డబ్బు కన్నా బంధాలు, అనుబంధాలే మిన్న అని చాటిచెప్పిన భావోద్వేగాల ప్రయాణమే ఈ 'వెంకట్రామయ్య గారి తాలూకా'.రేటింగ్: 3Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,TelanganaFirst Published :Jul 17, 2026 10:14 AM ISTమరింత చదవండి

Source link