ఈ స్కూటర్ల ధరలు మోడల్‌ను బట్టి రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు పలుకుతున్నాయి. అద్భుతమైన లుక్, పటిష్టమైన ఫిట్నెస్ కావాలనుకునే వారు కాస్త ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ మోడల్ రూ.40 వేలకు లభిస్తుండగా, ఫీచర్లను బట్టి రూ.42 వేలు, రూ.50 వేలు, రూ.60 వేలు, రూ.70 వేల ధరల్లో వివిధ వేరియంట్లు సిద్ధంగా ఉన్నాయి. సింగిల్ బ్యాటరీకి తోడు అదనపు బ్యాటరీ ఏర్పాటు చేసుకుంటే మైలేజ్ మరింత పెరుగుతుందని వ్యాపారి గణేష్ సూచిస్తున్నారు. అతి తక్కువ బడ్జెట్లో సొంత వాహనం కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇది నిజంగా ఒక సువర్ణావకాశం.
