ప్రభన్యూస్

Electric Scooter: రూ.1 కట్టనవసరం లేదు, 5 ఏళ్లు వారంటీ, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై 0 డౌన్ పేమెంట్ ఆఫర్! | బిజినెస్


Last Updated:

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావించే వారికి తీపికబురు. ఒక్క రూపాయి కట్టకుండానే బండిని ఇంటికి తీసుకెళ్లొచ్చు. జీరో డౌన్ పేమెంట్, 100% ఫైనాన్స్ సౌకర్యంతో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.

+

News18

News18

పెరుగుతున్న పెట్రోల్ ధరలు, పర్యావరణ కాలుష్యంతో విసిగిపోయిన వాహనదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ద్విచక్ర వాహనాల మార్కెట్లో రోజుకో కొత్త మోడల్ సందడి చేస్తుండటంతో వినియోగదారులకు ఎంచుకోవడానికి ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ ఈవీ మార్కెట్లో ఆంపియర్ కంపెనీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే బడ్జెట్ ధరలో అత్యుత్తమ మోడళ్లను అందిస్తుండటమే తమ బ్రాండ్ ప్రత్యేకత అని వరంగల్ ఆంపియర్ షోరూం సేల్స్ మేనేజర్ ఫరా వెల్లడించారు. తమ వద్ద ఉన్న ఆకర్షణీయమైన మోడళ్లు, వాటి ఫీచర్లను ఆయన వివరించారు.

ఆంపియర్ షోరూంలో ప్రారంభ ద్విచక్ర వాహనం ధర రూ.72 వేల నుంచి అందుబాటులో ఉంది. రియో వైబ్ మోడల్ స్కూటర్‌ను కొనుగోలు చేస్తే ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. ఇందులో 1.44 కిలోవాట్ల సామర్థ్యం గల లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ వాహనం సున్నా నుంచి వంద శాతం ఛార్జ్ కావడానికి ఐదు గంటల సమయం తీసుకుంటుంది. బూట్ స్పేస్, డిజిటల్ డిస్ప్లే, స్మార్ట్ ఫీచర్లు, బ్రేకింగ్ సస్పెన్షన్ తదితర సదుపాయాలతో తక్కువ బడ్జెట్‌లో వాహనం కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఇది కూడా చదవండి: Ration Card: 18 ఏళ్లు దాటాయా? రేషన్ కార్డు ఉంటే చాలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్!

కొద్దిగా ఎక్కువ ప్రయాణం చేసే వారి కోసం మ్యాగ్నస్ నియో మోడల్ ఎంతో అనువుగా ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.91 వేలుగా నిర్ణయించారు. ఇందులో 2.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉండటం వల్ల ఫుల్ ఛార్జింగ్‌తో ఏకంగా 125 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. రియల్ వరల్డ్ రేంజ్ కనీసం 85 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఆరు గంటల్లో బ్యాటరీ పూర్తి స్థాయి ఛార్జింగ్ అవుతుంది. భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ఈ స్కూటర్‌పై ఐదేళ్లు లేదా 75 వేల కిలోమీటర్ల వారంటీని కంపెనీ అందిస్తోంది. 3.5 అంగుళాల ఎల్‌సీడీ కన్సోల్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, 22 లీటర్ల బూట్ స్పేస్ లాంటి ఫీచర్లతో తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో కుటుంబ అవసరాలకు ఇది సరిగ్గా సరిపోతుంది.

ఇది కూడా చదవండి: School Holiday Today: ఏపీ, తెలంగాణలో ఈరోజు ఈ 7 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. విద్యార్థులకు శుభవార్త!

ఎక్కువ మైలేజ్, స్పీడ్ ఆశించే వారికోసం బడ్జెట్ ధరలో మ్యాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్ అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. 3.0 కిలోవాట్ల అధునాతన బ్యాటరీ కలిగిన ఈ వాహనం సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 142 కిలోమీటర్లు పరుగులు పెడుతుంది. గంటకు 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో వెళ్లే ఈ బండిలో 33 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్, రైడ్ మోడ్స్, మొబైల్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. ఏడు గంటల్లో ఛార్జ్ అయ్యే ఈ అప్‌డేటెడ్ మోడల్ ధర రూ.1.09 లక్షలు ఉంది. ముఖ్యంగా ఆంపియర్ కంపెనీకి చెందిన అన్ని వాహనాల్లో అత్యుత్తమ లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీలను వినియోగించడం వల్ల సాధారణ బ్యాటరీల కంటే ఇవి రెండింతలు అద్భుతమైన పనితీరును కనబరుస్తాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే వినియోగదారులకు బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. జేబులోంచి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా జీరో డౌన్‌పేమెంట్‌తో వంద శాతం ఫైనాన్స్ సదుపాయాన్ని సంస్థ కల్పిస్తోంది. కస్టమర్ సిబిల్ స్కోర్ 750 కంటే పైన ఉంటే చాలు సులభంగా వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఫైనాన్స్ కంపెనీలను బట్టి ఈఎంఐ కాలపరిమితి 12 నుంచి 36 నెలల వరకు ఎంచుకునే వీలుంది. ఉదాహరణకు రూ.72 వేల విలువైన స్కూటర్‌ను 36 నెలల ఈఎంఐ పద్ధతిలో తీసుకుంటే, నెలకు కేవలం రూ.2,100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. చేతిలో పెద్దగా డబ్బులు లేకున్నా వెంటనే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 September 2026, 2:23 pm Digital Edition : Prabhanews
Electric Scooter: రూ.1 కట్టనవసరం లేదు, 5 ఏళ్లు వారంటీ, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై 0 డౌన్ పేమెంట్ ఆఫర్! | బిజినెస్

Last Updated:Sep 25, 2026 2:13 PM ISTఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావించే వారికి తీపికబురు. ఒక్క రూపాయి కట్టకుండానే బండిని ఇంటికి తీసుకెళ్లొచ్చు. జీరో డౌన్ పేమెంట్, 100% ఫైనాన్స్ సౌకర్యంతో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.+
News18పెరుగుతున్న పెట్రోల్ ధరలు, పర్యావరణ కాలుష్యంతో విసిగిపోయిన వాహనదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ద్విచక్ర వాహనాల మార్కెట్లో రోజుకో కొత్త మోడల్ సందడి చేస్తుండటంతో వినియోగదారులకు ఎంచుకోవడానికి ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ ఈవీ మార్కెట్లో ఆంపియర్ కంపెనీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే బడ్జెట్ ధరలో అత్యుత్తమ మోడళ్లను అందిస్తుండటమే తమ బ్రాండ్ ప్రత్యేకత అని వరంగల్ ఆంపియర్ షోరూం సేల్స్ మేనేజర్ ఫరా వెల్లడించారు. తమ వద్ద ఉన్న ఆకర్షణీయమైన మోడళ్లు, వాటి ఫీచర్లను ఆయన వివరించారు.ఆంపియర్ షోరూంలో ప్రారంభ ద్విచక్ర వాహనం ధర రూ.72 వేల నుంచి అందుబాటులో ఉంది. రియో వైబ్ మోడల్ స్కూటర్‌ను కొనుగోలు చేస్తే ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. ఇందులో 1.44 కిలోవాట్ల సామర్థ్యం గల లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ వాహనం సున్నా నుంచి వంద శాతం ఛార్జ్ కావడానికి ఐదు గంటల సమయం తీసుకుంటుంది. బూట్ స్పేస్, డిజిటల్ డిస్ప్లే, స్మార్ట్ ఫీచర్లు, బ్రేకింగ్ సస్పెన్షన్ తదితర సదుపాయాలతో తక్కువ బడ్జెట్‌లో వాహనం కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.ఇది కూడా చదవండి: Ration Card: 18 ఏళ్లు దాటాయా? రేషన్ కార్డు ఉంటే చాలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్!కొద్దిగా ఎక్కువ ప్రయాణం చేసే వారి కోసం మ్యాగ్నస్ నియో మోడల్ ఎంతో అనువుగా ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.91 వేలుగా నిర్ణయించారు. ఇందులో 2.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉండటం వల్ల ఫుల్ ఛార్జింగ్‌తో ఏకంగా 125 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. రియల్ వరల్డ్ రేంజ్ కనీసం 85 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఆరు గంటల్లో బ్యాటరీ పూర్తి స్థాయి ఛార్జింగ్ అవుతుంది. భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ఈ స్కూటర్‌పై ఐదేళ్లు లేదా 75 వేల కిలోమీటర్ల వారంటీని కంపెనీ అందిస్తోంది. 3.5 అంగుళాల ఎల్‌సీడీ కన్సోల్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, 22 లీటర్ల బూట్ స్పేస్ లాంటి ఫీచర్లతో తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో కుటుంబ అవసరాలకు ఇది సరిగ్గా సరిపోతుంది.ఇది కూడా చదవండి: School Holiday Today: ఏపీ, తెలంగాణలో ఈరోజు ఈ 7 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. విద్యార్థులకు శుభవార్త!ఎక్కువ మైలేజ్, స్పీడ్ ఆశించే వారికోసం బడ్జెట్ ధరలో మ్యాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్ అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. 3.0 కిలోవాట్ల అధునాతన బ్యాటరీ కలిగిన ఈ వాహనం సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 142 కిలోమీటర్లు పరుగులు పెడుతుంది. గంటకు 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో వెళ్లే ఈ బండిలో 33 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్, రైడ్ మోడ్స్, మొబైల్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. ఏడు గంటల్లో ఛార్జ్ అయ్యే ఈ అప్‌డేటెడ్ మోడల్ ధర రూ.1.09 లక్షలు ఉంది. ముఖ్యంగా ఆంపియర్ కంపెనీకి చెందిన అన్ని వాహనాల్లో అత్యుత్తమ లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీలను వినియోగించడం వల్ల సాధారణ బ్యాటరీల కంటే ఇవి రెండింతలు అద్భుతమైన పనితీరును కనబరుస్తాయి.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే వినియోగదారులకు బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. జేబులోంచి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా జీరో డౌన్‌పేమెంట్‌తో వంద శాతం ఫైనాన్స్ సదుపాయాన్ని సంస్థ కల్పిస్తోంది. కస్టమర్ సిబిల్ స్కోర్ 750 కంటే పైన ఉంటే చాలు సులభంగా వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఫైనాన్స్ కంపెనీలను బట్టి ఈఎంఐ కాలపరిమితి 12 నుంచి 36 నెలల వరకు ఎంచుకునే వీలుంది. ఉదాహరణకు రూ.72 వేల విలువైన స్కూటర్‌ను 36 నెలల ఈఎంఐ పద్ధతిలో తీసుకుంటే, నెలకు కేవలం రూ.2,100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. చేతిలో పెద్దగా డబ్బులు లేకున్నా వెంటనే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం.మరింత చదవండి

Source link