అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ తక్కువ కాలానికి అద్దె ఇల్లు అవసరమైన వారు, ఇల్లు కొనడం లేదా నిర్మించుకోవడం సాధ్యం కాని పట్టణ ప్రజలకు ARH విభాగం ద్వారా అందుబాటు ధరల్లో గౌరవప్రదమైన, పరిశుభ్రమైన అద్దె ఇళ్లు అందిస్తారు. ఇందులో EWS, LIG వర్గాలతో పాటు వలస కార్మికులు, ఇల్లు లేని వారు, పరిశ్రమల్లో పనిచేసేవారు, ఉద్యోగాలు చేసే మహిళలు, నిర్మాణ కార్మికులు, పట్టణ పేదలు, నిరాశ్రయులు కూడా ఉంటారు. వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు తదితరులకు కూడా ఇది వర్తిస్తుంది. ఇళ్లలో నీరు, మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, ఆరోగ్య కేంద్రాలు వంటి అవసరమైన సదుపాయాలు ఉండేలా కూడా చర్యలు తీసుకుంటారు. PMAY-U 2.0 కింద అర్హత ఉన్న హోమ్ లోన్లపై వడ్డీ సబ్సిడీని ISS విభాగం ద్వారా అందిస్తారు. 2024 సెప్టెంబర్ 1 లేదా ఆ తర్వాత మంజూరై, చెల్లింపులు జరిగిన రుణాలకు ఇది వర్తిస్తుంది. EWS, LIG, MIG వర్గాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులు ఇల్లు కొనడం, తిరిగి కొనుగోలు చేయడం లేదా నిర్మించుకోవడం కోసం తీసుకున్న రుణాలపై ఈ సబ్సిడీ పొందవచ్చు. ఐదేళ్లకు మించిన లోన్ కాలవ్యవధి ఉన్న అర్హులైన లబ్ధిదారులకు గరిష్ఠంగా రూ.1.80 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ అందుతుంది. అందుబాటు ధరల్లో ఇళ్లను పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తీసుకురావడంపై PMAY-U నిరంతరం దృష్టి పెట్టింది. 2005 నుంచి 2014 మధ్య గతంలో అమలైన పథకాల కింద పట్టణాల్లో సుమారు 8 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 2026 ఆగస్టు 9 నాటికి PMAY-U, PMAY-U 2.0 కింద మొత్తం 1.25 కోట్ల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 1 కోటికి పైగా ఇళ్లు పూర్తయ్యి దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు అందాయి. (ప్రతీకాత్మక చిత్రం)

