Monsoon Floor Cleaning Tips: వర్షాకాలంలో ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా, ఈగలు, చీమలు వంటి కీటకాల బెడద ఉంటే ఇంటి వాతావరణమే అసౌకర్యంగా మారుతుంది. ముఖ్యంగా వంటగది, హాల్ వంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని నివారించేందుకు చాలామంది మార్కెట్లో లభించే కెమికల్ ఫ్లోర్ క్లీనర్లను ఉపయోగిస్తుంటారు. అయితే అవి ఖరీదైనవే కాకుండా, వాటి వాసన కూడా అందరికీ నచ్చకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వంటింట్లోనే ఉండే కొన్ని సాధారణ వస్తువులతో ఫ్లోర్‌ను శుభ్రం చేస్తూనే, ఈగలు, చీమల సమస్యను కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.

