Chain Snatching: గొలుసు దొంగలుగా మారిన తల్లి, కొడుకు.. యూట్యూబ్ చూసి.. చైన్ స్నాచింగ్‌లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Chain Snatching: కాలం ఎవ్వర్నీ వదలదు. ప్రతీ ఒక్కరికీ జీవితంలో పరీక్షలు పెడుతుంది. ఆ సమయంలో మనం ఆ పరీక్షల్ని ఏ మార్గంలో ఎదుర్కొన్నాం అనేది కీలకం. సరైన మార్గంలో ఎదుర్కొంటే.. సమాజం గౌరవిస్తుంది. తప్పుదారిలో వెళ్తే.. జైలు పలకరిస్తుంది. ఆ తల్లి, కొడుకు విషయంలో అదే జరిగింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అది విశాఖపట్నంలోని.. పెందుర్తి. జూన్ 27వ తేదీ సాయంత్రం. సుజాతనగర్ నిర్మానుష్యంగా ఉంది. ఆ సమయంలో ఓ ముసలామె.. రోడ్డు పక్కన ఒంటరిగా వెళ్తుంది. ఆమె పక్కన ఓ స్కూటీ వచ్చి ఆగింది. దానిపై ఓ కుర్రాడు, ఓ తల్లి ఉన్నారు. ఆ కుర్రాడు తలకు టోపీ, ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు. ఆ తల్లి.. ముఖానికి చున్నీ అడ్డం పెట్టుకుంది. వాళ్లు.. ఆ ముసలామెను ఏదో అడ్రెస్ అడిగారు. ఆమె చెప్పేలోపే.. ఆమె మెడలోని 5 తులాల బంగారు నల్లపూసల గొలుసు, తాళిని తెంచుకొని.. స్కూటీపై పారిపోయారు.

68 ఏళ్ల ఆ ముసలామె.. ఆ వయసులో ఇబ్బంది పడుతూ.. పోలీసుల్ని చేరి.. కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కేసు రాసి.. సీసీటీవీ ఫుటేజ్ చూశారు. స్కూటీ కనిపించినా, దాని ముందు నంబర్ కనిపించలేదు. నంబర్ ప్లేటుకి ఓ రిబ్బన్ చుట్టి ఉంది. వెనకైతే అసలు నంబర్ ప్లేటే లేదు. దాంతో పోలీసులకు ఈ కేసును ఎలా డీల్ చెయ్యాలి అనే సవాలు వచ్చింది.

జనరల్‌గా చైన్ స్నాచింగ్‌ చేసేది మగాళ్లే. కానీ ఈ కేసులో ఓ మహిళ చైన్ చోరీ చేసింది. స్కూటీ నడిపిన కుర్రాణ్ని, వెనక కూర్చున్న ఆమెను గమనిస్తే.. వారిద్దరూ తల్లీ, కొడుకులా పోలీసులకు అనిపించింది. ఈ కేసును ఎట్టకేలకు ఛేదించారు. నిందితులు విశాఖలోని రామా టాకీస్‌లో ఉండే ధనలక్ష్మీ, అక్షిత్ అని తెలిసింది. వాళ్లు ఎందుకీ చోరీ చేశారు అనేది పోలీసులు ప్రశ్నించగా.. పెద్ద కథే చెప్పారు.

ధనలక్ష్మీ.. లగ్జరీ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడింది. భర్త సాధారణ కారు డ్రైవర్. కొడుకు డిగ్రీ చదువుతున్నాడు. ఐతే.. ఆమె డబ్బు పిచ్చితో.. స్థానికులతో చిట్టీలు వేయించి, ఫెయిలైంది. తర్వాత అప్పుల మీద అప్పులు చేసింది. అలాగే పెద్ద ఫ్లాట్ కొని, వాయిదాలు చెల్లించలేకపోయింది. చివరకు అప్పులోళ్లు ఇంటిమీదపడ్డారు. దాంతో భర్త ఎటో వెళ్లిపోయాడు. ఆ పరిస్థితుల్లో ఆమె సూసైడ్ చేసుకోవాలని అనుకుంది. కానీ ధైర్యం చాలలేదు.

ఈజీగా డబ్బు ఎలా సంపాదించాలి అని యూట్యూబ్‌లో సెర్చ్ చేసింది. ఎన్నో మంచి మార్గాలు ఉన్నా, అవన్నీ వదిలేసి.. చైన్ స్నాచింగ్ చెయ్యాలని అనుకుంది. అలా తొలిసారి ప్రయత్నించి.. పోలీసులకు దొరికిపోయారు. ఇప్పుడు తల్లీ కొడుకూ.. జైలుపాలయ్యారు. ఇంతకీ పోలీసులు ఎలా కనిపెట్టారు.

పోలీసులకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వారు.. ఈ కేసును మరోలా డీల్ చేశారు. కొన్ని రోజులుగా.. పెందుర్తిలోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్‌ని గమనించడం మొదలుపెట్టారు. స్కూటీపై వెళ్తున్న కొడుకు, తల్లి లాంటి వారు ఎక్కడైనా కనిపిస్తారేమో అని చూశారు. తాజాగా అలాంటి వారే స్కూటీపై వెళ్తూ కనిపించడంతో.. అసలు ఆ స్కూటీ.. ఎక్కడి నుంచి బయలుదేరింది.. అనేది.. ఆ రూట్లోని సీసీ టీవీ ఫుటేజ్‌లను కనిపెడుతూ.. వెనక్కి చెక్ చేశారు. అలా గో టూ బ్యాక్.. విధానంలో.. ఓ ఇంటి నుంచి ఆ స్కూటీ బయలుదేరినట్లు అర్థమైంది. అంతే… కేసు సాల్వ్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 July 2026, 6:56 am Digital Edition : Prabhanews
Chain Snatching: గొలుసు దొంగలుగా మారిన తల్లి, కొడుకు.. యూట్యూబ్ చూసి.. చైన్ స్నాచింగ్‌లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 07, 2026 5:13 AM ISTChain Snatching: కాలం ఎవ్వర్నీ వదలదు. ప్రతీ ఒక్కరికీ జీవితంలో పరీక్షలు పెడుతుంది. ఆ సమయంలో మనం ఆ పరీక్షల్ని ఏ మార్గంలో ఎదుర్కొన్నాం అనేది కీలకం. సరైన మార్గంలో ఎదుర్కొంటే.. సమాజం గౌరవిస్తుంది. తప్పుదారిలో వెళ్తే.. జైలు పలకరిస్తుంది. ఆ తల్లి, కొడుకు విషయంలో అదే జరిగింది.ప్రతీకాత్మక చిత్రంఅది విశాఖపట్నంలోని.. పెందుర్తి. జూన్ 27వ తేదీ సాయంత్రం. సుజాతనగర్ నిర్మానుష్యంగా ఉంది. ఆ సమయంలో ఓ ముసలామె.. రోడ్డు పక్కన ఒంటరిగా వెళ్తుంది. ఆమె పక్కన ఓ స్కూటీ వచ్చి ఆగింది. దానిపై ఓ కుర్రాడు, ఓ తల్లి ఉన్నారు. ఆ కుర్రాడు తలకు టోపీ, ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు. ఆ తల్లి.. ముఖానికి చున్నీ అడ్డం పెట్టుకుంది. వాళ్లు.. ఆ ముసలామెను ఏదో అడ్రెస్ అడిగారు. ఆమె చెప్పేలోపే.. ఆమె మెడలోని 5 తులాల బంగారు నల్లపూసల గొలుసు, తాళిని తెంచుకొని.. స్కూటీపై పారిపోయారు.68 ఏళ్ల ఆ ముసలామె.. ఆ వయసులో ఇబ్బంది పడుతూ.. పోలీసుల్ని చేరి.. కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కేసు రాసి.. సీసీటీవీ ఫుటేజ్ చూశారు. స్కూటీ కనిపించినా, దాని ముందు నంబర్ కనిపించలేదు. నంబర్ ప్లేటుకి ఓ రిబ్బన్ చుట్టి ఉంది. వెనకైతే అసలు నంబర్ ప్లేటే లేదు. దాంతో పోలీసులకు ఈ కేసును ఎలా డీల్ చెయ్యాలి అనే సవాలు వచ్చింది.జనరల్‌గా చైన్ స్నాచింగ్‌ చేసేది మగాళ్లే. కానీ ఈ కేసులో ఓ మహిళ చైన్ చోరీ చేసింది. స్కూటీ నడిపిన కుర్రాణ్ని, వెనక కూర్చున్న ఆమెను గమనిస్తే.. వారిద్దరూ తల్లీ, కొడుకులా పోలీసులకు అనిపించింది. ఈ కేసును ఎట్టకేలకు ఛేదించారు. నిందితులు విశాఖలోని రామా టాకీస్‌లో ఉండే ధనలక్ష్మీ, అక్షిత్ అని తెలిసింది. వాళ్లు ఎందుకీ చోరీ చేశారు అనేది పోలీసులు ప్రశ్నించగా.. పెద్ద కథే చెప్పారు.ధనలక్ష్మీ.. లగ్జరీ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడింది. భర్త సాధారణ కారు డ్రైవర్. కొడుకు డిగ్రీ చదువుతున్నాడు. ఐతే.. ఆమె డబ్బు పిచ్చితో.. స్థానికులతో చిట్టీలు వేయించి, ఫెయిలైంది. తర్వాత అప్పుల మీద అప్పులు చేసింది. అలాగే పెద్ద ఫ్లాట్ కొని, వాయిదాలు చెల్లించలేకపోయింది. చివరకు అప్పులోళ్లు ఇంటిమీదపడ్డారు. దాంతో భర్త ఎటో వెళ్లిపోయాడు. ఆ పరిస్థితుల్లో ఆమె సూసైడ్ చేసుకోవాలని అనుకుంది. కానీ ధైర్యం చాలలేదు.ఈజీగా డబ్బు ఎలా సంపాదించాలి అని యూట్యూబ్‌లో సెర్చ్ చేసింది. ఎన్నో మంచి మార్గాలు ఉన్నా, అవన్నీ వదిలేసి.. చైన్ స్నాచింగ్ చెయ్యాలని అనుకుంది. అలా తొలిసారి ప్రయత్నించి.. పోలీసులకు దొరికిపోయారు. ఇప్పుడు తల్లీ కొడుకూ.. జైలుపాలయ్యారు. ఇంతకీ పోలీసులు ఎలా కనిపెట్టారు.పోలీసులకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వారు.. ఈ కేసును మరోలా డీల్ చేశారు. కొన్ని రోజులుగా.. పెందుర్తిలోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్‌ని గమనించడం మొదలుపెట్టారు. స్కూటీపై వెళ్తున్న కొడుకు, తల్లి లాంటి వారు ఎక్కడైనా కనిపిస్తారేమో అని చూశారు. తాజాగా అలాంటి వారే స్కూటీపై వెళ్తూ కనిపించడంతో.. అసలు ఆ స్కూటీ.. ఎక్కడి నుంచి బయలుదేరింది.. అనేది.. ఆ రూట్లోని సీసీ టీవీ ఫుటేజ్‌లను కనిపెడుతూ.. వెనక్కి చెక్ చేశారు. అలా గో టూ బ్యాక్.. విధానంలో.. ఓ ఇంటి నుంచి ఆ స్కూటీ బయలుదేరినట్లు అర్థమైంది. అంతే... కేసు సాల్వ్.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link