అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు తీవ్ర కలకలం రేపుతోంది. ఆరెంజ్ కౌంటీలో బలమైన శాంటా అనా గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. శాన్ జువాన్ కాపిస్ట్రానో సమీపంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు విస్తరిస్తుండటంతో అధికారులు కొన్ని ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆకాశం నుంచి తీసిన దృశ్యాల్లో భారీగా వ్యాపిస్తున్న మంటలు, అగ్నిప్రమాద తీవ్రత స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Source link
California Wildfires : కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం!
