అధిక టాప్ స్పీడ్, మెరుగైన రేంజ్ కోరుకునేవారికి Vida VX2 GO మరో బలమైన ఎంపికగా కనిపిస్తోంది. దీని గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లు కాగా, ప్రకటించిన రేంజ్ సుమారు 92 కిలోమీటర్లు. TVS OrBiter V1 కూడా 68 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 86 కిలోమీటర్ల రేంజ్‌తో ఆకట్టుకుంటోంది. మొత్తంగా రూ.45 వేల నుంచి రూ.50 వేల బడ్జెట్లో Bounce Infinity E1, TVS OrBiter V1 వంటి మోడళ్లను పరిశీలించవచ్చు. Zelio Gracy I ధర కొంచెం ఎక్కువైనా 65 కిలోమీటర్ల వేగం, 70 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తోంది.
