అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం చేస్తారని పేర్కొన్నారు. కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, UCO బ్యాంక్‌లను బ్యాంక్ ఆఫ్ బరోడాకు బదిలీ చేస్తారని కూడా ఆ నకిలీ పత్రంలో ఉంది. విలీనం తర్వాత సంబంధిత బ్యాంకుల ఆస్తులు, అప్పులు, హక్కులు, క్లెయిమ్‌లు, బాధ్యతలు వాటిని స్వీకరించే బ్యాంకులకు బదిలీ అవుతాయని పత్రంలో పేర్కొన్నారు. ఉద్యోగుల సర్వీస్ కొనసాగుతుందని, కస్టమర్ల బ్యాంక్ ఖాతాలు, ఇతర బ్యాంకింగ్ ఏర్పాట్లు కూడా యథావిధిగా కొనసాగుతాయని అందులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)

