ప్రభన్యూస్

Bank News: 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే… ఆ బ్యాంకులపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం |


సీఎన్‌బీసీటీవీ18 ప్రకారం 2000ల ప్రారంభంలో కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభాలు, గవర్నెన్స్‌లో బయటపడిన అక్రమాల నేపథ్యంలో ఆర్‌బీఐ 2004లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు కొత్త లైసెన్సులు ఇవ్వడం నిలిపివేసింది. కొన్ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులపై రాజకీయ నాయకుల ప్రభావం ఎక్కువగా ఉండటం, గవర్నెన్స్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తడం, అప్పుడప్పుడూ ఆర్థిక ఒత్తిడి ఎదురవడం వంటి కారణాల వల్లే కొత్త లైసెన్సుల జారీపై ఇంతకాలం ఆంక్షలు కొనసాగాయని భావిస్తున్నారు. “ఆన్-ట్యాప్ లైసెన్సింగ్” అంటే బ్యాంకులకు లైసెన్స్ ఇవ్వడానికి ఒక నిరంతర విధానం. అంటే, ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే కాకుండా, అవసరమైనప్పుడు ఎప్పుడైనా కొత్త బ్యాంకులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటం. సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో కొత్త లైసెన్సుల కోసం ఆర్‌బీఐ ప్రత్యేకంగా ఒక గడువు లేదా విండో ప్రకటిస్తుంది. ఆ సమయంలో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. కానీ “ఆన్-ట్యాప్ లైసెన్సింగ్” విధానంలో ఆర్‌బీఐ ఎప్పుడైనా దరఖాస్తులను స్వీకరిస్తుంది. దరఖాస్తుదారులు నిర్దేశించిన అర్హతలు, నిబంధనలు పాటిస్తే పరిశీలించి లైసెన్స్ ఇవ్వొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 August 2026, 1:41 pm Digital Edition : Prabhanews
Bank News: 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే… ఆ బ్యాంకులపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం |

సీఎన్‌బీసీటీవీ18 ప్రకారం 2000ల ప్రారంభంలో కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభాలు, గవర్నెన్స్‌లో బయటపడిన అక్రమాల నేపథ్యంలో ఆర్‌బీఐ 2004లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు కొత్త లైసెన్సులు ఇవ్వడం నిలిపివేసింది. కొన్ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులపై రాజకీయ నాయకుల ప్రభావం ఎక్కువగా ఉండటం, గవర్నెన్స్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తడం, అప్పుడప్పుడూ ఆర్థిక ఒత్తిడి ఎదురవడం వంటి కారణాల వల్లే కొత్త లైసెన్సుల జారీపై ఇంతకాలం ఆంక్షలు కొనసాగాయని భావిస్తున్నారు. "ఆన్-ట్యాప్ లైసెన్సింగ్" అంటే బ్యాంకులకు లైసెన్స్ ఇవ్వడానికి ఒక నిరంతర విధానం. అంటే, ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే కాకుండా, అవసరమైనప్పుడు ఎప్పుడైనా కొత్త బ్యాంకులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటం. సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో కొత్త లైసెన్సుల కోసం ఆర్‌బీఐ ప్రత్యేకంగా ఒక గడువు లేదా విండో ప్రకటిస్తుంది. ఆ సమయంలో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. కానీ "ఆన్-ట్యాప్ లైసెన్సింగ్" విధానంలో ఆర్‌బీఐ ఎప్పుడైనా దరఖాస్తులను స్వీకరిస్తుంది. దరఖాస్తుదారులు నిర్దేశించిన అర్హతలు, నిబంధనలు పాటిస్తే పరిశీలించి లైసెన్స్ ఇవ్వొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link