Starlink: స్టార్‌లింక్‌తో మీ వ్యక్తిగత డేటా సురక్షితమేనా? భారతీయులు తెలుసుకోవాల్సిన విషయాలివే! | బిజినెస్
ఈ అంశాలపై ఏప్రిల్ 2026లో ప్రచురితమైన ‘ది తక్షశిల ఇన్‌స్టిట్యూషన్’ నివేదిక పలు ఆందోళనలను ప్రస్తావించింది. స్టార్‌లింక్ గోప్యతా విధానంలోని కొన్ని నిబంధనలు వినియోగదారుల డేటా వినియోగం, దాని భాగస్వామ్యం, నిఘాకు సంబంధించిన ప్రమాదాలను సృష్టించే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించే సంస్థలు సేకరించే సమాచారం ఎలా ఉపయోగిస్తాయి? దానిపై ప్రభుత్వాలకు ఎంత నియంత్రణ ఉంటుంది? అనే ప్రశ్నలకు ఈ నివేదిక ప్రాధాన్యం ఇచ్చింది. ఏఐ శిక్షణ కోసం వినియోగదారుల…
