బుధవారం రోజున బుధుడు పాలిస్తాడు. కమ్యూనికేషన్, మేధస్సు, వాణిగ్యానికి బుధుడు ప్రతీక. ఈ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల మానసిక స్పష్టత ఏకాగ్రత పెరుగుతాయి. ఇది ముఖ్యమైన సమావేశాలకు లేదంటే పరీక్షలకు వెళ్లే వారికి మేలు చేస్తుంది. గురువారం అంటే బృహస్పతి దినంగా పరిగణిస్తారు. గురుడు జ్ఞానం సంపద అదృష్టానికి ప్రతీక. ఈ రోజున పసుపు, బంగారు, రంగు లేదంటే నారింజ రంగు దుస్తులు ధరించడం వల్ల అదృష్టం, విజయం, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తాయి.

