ప్రభన్యూస్

Gold Price: ధనత్రయోదశి రోజే బంగారం, వెండి ధరలు భారీగా పతనం.. కొనేవారికి పండగే! | బిజినెస్


Last Updated:

Gold Price Today: ఎన్నో రోజుల నుంచి ధనత్రయోదశి రోజు బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి నిజంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనే చెప్పుకోవాలి. ధనత్రయోదశి రోజు బంగారం, వెండి ధరలు అత్యంత భారీగా తగ్గాయి. గురువారం భారీగా పెరిగిన ధరలు ఈరోజు ఒక్కసారిగా పతనమయ్యాయి.

News18
News18

ధనత్రయోదశి సందర్భంగా బంగారం, వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి బంపర్ గుడ్ న్యూస్. పండుగ రోజు పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు పండుగే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ధనత్రయోదశి రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావించే వారు ఈ ధరల తగ్గుదలతో కొనేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గురువారం భారీగా పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే గణనీయంగా పడిపోయాయి.

MCXలో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయంటే?

శుక్రవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డిసెంబర్ 4 గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,42,250 వద్ద కొనసాగుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే రూ.1,845 తగ్గింది. అంటే ఒక్కరోజులోనే 10 గ్రాముల బంగారంపై ఇంత భారీ తగ్గుదల నమోదైంది. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనించాయి. MCXలో డిసెంబర్ 4 సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,84,385 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై ఏకంగా రూ.2,755 తగ్గింది. దీంతో పండుగ సమయంలో వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా కొంత ఊరట లభించింది.

హైదరాబాద్ మార్కెట్‌లోనూ భారీగా తగ్గిన ధరలు..

ఫ్యూచర్స్ మార్కెట్‌లోనే కాకుండా, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం ఉదయం 9:10 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,660 తగ్గి రూ.1,42,770కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,30,870 వద్ద కొనసాగుతోంది. వెండి కొనుగోలుదారులకు కూడా ధరల తగ్గుదల ఊరటనిచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే రూ.2,460 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,85,040 వద్ద కొనసాగుతోంది.

సాధారణంగా ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం శుభప్రదమని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ రోజున చిన్న నాణేలు మొదలుకొని ఆభరణాల వరకు కొనుగోలు చేస్తుంటారు. ఈసారి పండుగ రోజే ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కలిసొచ్చే అంశం. అయితే బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి రోజులోనే మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆభరణాలు కొనుగోలు చేసేవారు షాపులో తాజా ధరలు, తరుగు, మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వివరాలు తెలుసుకున్న తర్వాత కొనుగోలు చేయడం మంచిది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 9:20 am Digital Edition : Prabhanews
Gold Price: ధనత్రయోదశి రోజే బంగారం, వెండి ధరలు భారీగా పతనం.. కొనేవారికి పండగే! | బిజినెస్

Last Updated:Nov 06, 2026 9:16 AM ISTGold Price Today: ఎన్నో రోజుల నుంచి ధనత్రయోదశి రోజు బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి నిజంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనే చెప్పుకోవాలి. ధనత్రయోదశి రోజు బంగారం, వెండి ధరలు అత్యంత భారీగా తగ్గాయి. గురువారం భారీగా పెరిగిన ధరలు ఈరోజు ఒక్కసారిగా పతనమయ్యాయి.
News18ధనత్రయోదశి సందర్భంగా బంగారం, వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి బంపర్ గుడ్ న్యూస్. పండుగ రోజు పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు పండుగే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ధనత్రయోదశి రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావించే వారు ఈ ధరల తగ్గుదలతో కొనేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గురువారం భారీగా పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే గణనీయంగా పడిపోయాయి.MCXలో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయంటే?శుక్రవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డిసెంబర్ 4 గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,42,250 వద్ద కొనసాగుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే రూ.1,845 తగ్గింది. అంటే ఒక్కరోజులోనే 10 గ్రాముల బంగారంపై ఇంత భారీ తగ్గుదల నమోదైంది. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనించాయి. MCXలో డిసెంబర్ 4 సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,84,385 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై ఏకంగా రూ.2,755 తగ్గింది. దీంతో పండుగ సమయంలో వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా కొంత ఊరట లభించింది.హైదరాబాద్ మార్కెట్‌లోనూ భారీగా తగ్గిన ధరలు..ఫ్యూచర్స్ మార్కెట్‌లోనే కాకుండా, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం ఉదయం 9:10 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,660 తగ్గి రూ.1,42,770కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,30,870 వద్ద కొనసాగుతోంది. వెండి కొనుగోలుదారులకు కూడా ధరల తగ్గుదల ఊరటనిచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే రూ.2,460 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,85,040 వద్ద కొనసాగుతోంది.సాధారణంగా ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం శుభప్రదమని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ రోజున చిన్న నాణేలు మొదలుకొని ఆభరణాల వరకు కొనుగోలు చేస్తుంటారు. ఈసారి పండుగ రోజే ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కలిసొచ్చే అంశం. అయితే బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి రోజులోనే మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆభరణాలు కొనుగోలు చేసేవారు షాపులో తాజా ధరలు, తరుగు, మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వివరాలు తెలుసుకున్న తర్వాత కొనుగోలు చేయడం మంచిదిమరింత చదవండి

Source link