Last Updated:
అల్లు అర్జున్- అట్లీ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా రాకా. తాజాగా ఈ సినిమాపై అంచనాలు పెంచేసే ఓ వీడియో వదిలింది మంచు లక్ష్మి.
పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘రాకా’. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్లో బన్నీ బీస్ట్ లుక్కు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి నటి మంచు లక్ష్మి కీలక అప్డేట్ ఇచ్చారు.

