ప్రభన్యూస్

Allu Arjun: అల్లు అర్జున్ ‘రాకా’పై బుర్ర పేలిపోయే అప్‌డేట్.. మరీ ఈ రేంజ్‌లో ప్లాన్ చేశారేంట్రా సామీ..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee) కాంబోలో వస్తున్న రాకా సినిమాపై క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ఆ వివరాలు చూస్తే..

News18
News18

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar) దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ‘రాకా’ (Raaka) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్‌ను ఫాలో అవుతూ మేకర్స్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

నిజానికి స్క్రిప్ట్ వర్క్ దశలో ఈ సినిమాను ఒకే భాగంగా రూపొందించి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అట్లీ రాసుకున్న కథా నేపథ్యం, దాని స్పాన్ చాలా పెద్దది కావడం.. దానికి తోడు భారీ బడ్జెట్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండటంతో ఈ కథను ఒకే పార్టులో చెప్పడం కష్టమని దర్శకుడు భావించారట. కంటెంట్ డిమాండ్ మేరకు సినిమాను ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’, ‘పుష్ప’, ‘సలార్’ తరహాలో రెండు భాగాలుగా విడుదల చేస్తే బాగుంటుందనే ప్రతిపాదనను అల్లు అర్జున్, నిర్మాత కళానిధి మారన్ ముందు అట్లీ ఉంచారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత, రెండు పార్టుల ఐడియాకు వారిద్దరూ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.

శరవేగంగా షూటింగ్.. ఓటీటీ రైట్స్‌కు భారీ డిమాండ్:

ప్రస్తుతం ‘రాకా’ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2026 సంవత్సరాంతానికి రెండు భాగాలకు సంబంధించిన మొత్తం షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని చిత్ర బృందం టార్గెట్‌గా పెట్టుకుంది. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాతే, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగిన సమయం తీసుకుని రిలీజ్ డేట్స్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ (ఓటీటీ) హక్కుల కోసం ప్రముఖ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ.. అల్లు అర్జున్, అట్లీలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా దర్శక నిర్మాతలు మరింత భారీ రేటును ఆశిస్తున్నారట. అందుకే రైట్స్ ఇంకా అమ్మలేదని టాక్.

పాన్ ఇండియా అప్పీల్ కోసం ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్‌ను తీసుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) మెయిన్ లీడ్‌గా కన్ఫర్మ్ కాగా.. కథలోని ఇతర కీలక పాత్రల కోసం రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి పాన్ ఇండియా స్టార్స్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 July 2026, 2:41 pm Digital Edition : Prabhanews
Allu Arjun: అల్లు అర్జున్ ‘రాకా’పై బుర్ర పేలిపోయే అప్‌డేట్.. మరీ ఈ రేంజ్‌లో ప్లాన్ చేశారేంట్రా సామీ..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 29, 2026 2:35 PM ISTఅల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee) కాంబోలో వస్తున్న రాకా సినిమాపై క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ఆ వివరాలు చూస్తే.. News18ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar) దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు 'రాకా' (Raaka) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్‌ను ఫాలో అవుతూ మేకర్స్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.నిజానికి స్క్రిప్ట్ వర్క్ దశలో ఈ సినిమాను ఒకే భాగంగా రూపొందించి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అట్లీ రాసుకున్న కథా నేపథ్యం, దాని స్పాన్ చాలా పెద్దది కావడం.. దానికి తోడు భారీ బడ్జెట్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండటంతో ఈ కథను ఒకే పార్టులో చెప్పడం కష్టమని దర్శకుడు భావించారట. కంటెంట్ డిమాండ్ మేరకు సినిమాను 'బాహుబలి', 'కేజీఎఫ్', 'పుష్ప', 'సలార్' తరహాలో రెండు భాగాలుగా విడుదల చేస్తే బాగుంటుందనే ప్రతిపాదనను అల్లు అర్జున్, నిర్మాత కళానిధి మారన్ ముందు అట్లీ ఉంచారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత, రెండు పార్టుల ఐడియాకు వారిద్దరూ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.శరవేగంగా షూటింగ్.. ఓటీటీ రైట్స్‌కు భారీ డిమాండ్:ప్రస్తుతం 'రాకా' రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2026 సంవత్సరాంతానికి రెండు భాగాలకు సంబంధించిన మొత్తం షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని చిత్ర బృందం టార్గెట్‌గా పెట్టుకుంది. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాతే, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగిన సమయం తీసుకుని రిలీజ్ డేట్స్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ (ఓటీటీ) హక్కుల కోసం ప్రముఖ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ.. అల్లు అర్జున్, అట్లీలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా దర్శక నిర్మాతలు మరింత భారీ రేటును ఆశిస్తున్నారట. అందుకే రైట్స్ ఇంకా అమ్మలేదని టాక్.పాన్ ఇండియా అప్పీల్ కోసం ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్‌ను తీసుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) మెయిన్ లీడ్‌గా కన్ఫర్మ్ కాగా.. కథలోని ఇతర కీలక పాత్రల కోసం రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి పాన్ ఇండియా స్టార్స్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link