ఇన్నాళ్లూ ఇంట్లో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్.. ఇలా అందరూ మగవాళ్లే ఉండేవారని, ఇప్పుడు తనకు ఇద్దరు కూతుళ్లు తోడవ్వడం అత్తగా తనకు అనంతమైన సంతోషాన్ని ఇస్తోందని అమల భావోద్వేగానికి గురయ్యారు. ఈ విధంగా తమ ఇంటి కోడళ్లపై అమల చూపించిన ప్రేమ, వారి గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరు కోడళ్లతో అక్కినేని కుటుంబం మరింత శోభాయమానంగా మారిందని, ఎప్పటికీ వారు ఇలాగే ఆనందంగా ఉండాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

