Last Updated:
ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై యాంకర్ గా భారీ క్రేజ్ సంపాదించిన ఉదయభాను తాజాగా ఓ వీడియో వదులుతూ సర్ప్రైజ్ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై యాంకరింగ్ అంటే ఉదయభాను.. ఉదయభాను అంటే యాంకరింగ్. తన మాటల గారడీతో, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన స్టార్ యాంకర్ ఉదయభాను ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తారు. ఇతరులు తనకు అవకాశాలు ఇవ్వడం కోసం ఎదురుచూసే స్థాయి నుంచి, కొత్త టాలెంట్‌కు తానే అవకాశాలు కల్పించే బాస్ స్థాయికి ఎదిగారు. సొంతంగా ‘ఉదయభాను ప్రొడక్షన్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి డిజిటల్, మూవీ రంగాల్లోకి సగర్వంగా అడుగుపెట్టారు.

