2. ముళ్ల మొక్కలు – కాక్టస్, కలబంద… వాస్తు, బోటనీ ప్రకారం ముళ్ల మొక్కలను తులసికి దూరంగా ఉంచాలి. కాక్టస్, బొంతజెముడు లేదా ఇతర ముళ్ల మొక్కలు శుష్క వాతావరణంలో పెరిగేవి. తులసికి తేమతో కూడిన మట్టి, స్వచ్ఛమైన వాతావరణం కావాలి. ముళ్ల మొక్కలు విడుదల చేసే ఉద్గారాలు, వాటి తీవ్రత తులసి ఎదుగుదలను దెబ్బతీస్తాయి. వాస్తు ప్రకారం తులసి పక్కన ముళ్ల మొక్కలు ఉంటే ఇంట్లో ఆర్థిక నష్టాలు, కలహాలు పెరుగుతాయి.
