మహిళల నిర్ణయాధికారంపై బోల్డ్ స్టేట్‌మెంట్: మహిళా నిర్ణయాధికారంపై సామ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “మహిళలు ఎప్పుడూ ఇతరుల ఎంపిక కోసం వేచి చూడాలి, సొంతంగా ఎంచుకోకూడదు అనేది సమాజం సృష్టించిన అతిపెద్ద అబద్ధం. కెరీర్ అయినా, వ్యక్తిగత బంధాలైనా, ఉన్నత స్థానాలైనా… నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు, శక్తి మహిళలకే ఉంది” అని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం సమంత ఫోటోలు, ఆమె చేసిన శక్తివంతమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
